గుడ్డు చాలా పోషకాలతో కూడిన ఆహారం. ఇందులో శరీరానికి కావాలసిన పోషకాలన్నీ ఉంటాయి. అందుకే గుడ్డును సూపర్ ఫుడ్ అని అంటారు. ప్రతిరోజూ గుడ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
Telugu
రోజూ గుడ్లు తింటే ప్రమాదమా?
గుడ్డులోని తెల్లసొనలో 50 శాతం ప్రోటీన్, పచ్చసొనలో 90 శాతం కాల్షియం, ఐరన్ ఉంటాయి. అయితే.. రోజూ గుడ్లు తింటే ఏమైనా ప్రమాదమా? దీని గురించి చాలా మందిలో సందేహం ఉంటుంది.
Telugu
వైద్యుల సలహా తప్పనిసరి
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఆరోగ్య నిపుణుల సలహా మేరకు మాత్రమే ఆహారంలో గుడ్డును చేర్చుకోవాలి.
Telugu
వారికి ప్రమాదం
కొంతమంది గుడ్డును అతిగా తింటారు. ఈ అలవాటు వల్ల శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
Telugu
జీర్ణ సమస్యలు
గుడ్డులో ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుడ్డును అతిగా తింటే శరీరంలో జీర్ణ సమస్యలు వస్తాయి.
Telugu
వారానికి ఎన్నితినవచ్చు?
ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారంలో భాగంగా వారానికి నాలుగు రోజులు గుడ్లు తినడం సురక్షితమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Telugu
వారు అతిగా తింటే ప్రమాదమే
గుండె సంబంధిత వ్యాధులు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్డును అతిగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు.