పాత్రల్లో మిగిలిన ఆహార పదార్థాలు ఉంటే డిష్‌వాషర్‌లో ఇరుక్కుపోయి, పాత్రలు శుభ్రంగా కడుగవు. దుర్వాసన వస్తుంది.
మిగిలిన ఆహారాన్ని పూర్తిగా తీసి వేయకుండా పాత్రలను డిష్ వాషర్‌లో వేయడం వల్ల త్వరగా మిషన్ పాడుకావడమే కాదు. దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.
డ్రెయిన్‌లోకి మురికి, మిగిలిన ఆహారపదార్థాలు పోకుండా ఫిల్టర్ ఉంటుంది. వాడిన తర్వాత దాన్ని తీసివేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి, అవసరమైతే మృదువైన బ్రష్, డిష్ సోప్ వాడండి.
ఫిల్టర్‌లో మురికి ఉంటే డ్రెయిన్ మూసుకుపోయి దుర్వాసన వస్తుంది. అలాగే.. డ్రెయిన్ గొట్టం వంగిపోకుండా చూసుకోండి. డిష్‌వాషర్ అడుగున నీరు పేరుకుపోకుండా చూసుకోండి.
వెనిగర్, బేకింగ్ సోడాతో శుభ్రం చేయండి. పైభాగంలో ఉన్న రాక్‌లోని డిష్‌వాషర్-సేఫ్ గిన్నెలో ఒక కప్పు తెల్ల వెనిగర్ ఉంచండి. తరువాత, అడుగున ఒక కప్పు బేకింగ్ సోడాను చల్లండి.