Food
కృత్రిమంగా పండించిన అరటిపండ్లను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి అరటిపండ్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కార్బైడ్ రసాయనంతో మగ్గబెట్టిన అరటిపండ్లు సహజంగా మగ్గబెట్టిన పండ్లలాంటి టేస్ట్ ఉండవు. అంటే టేస్ట్ లో తేడా ఉంటుంది. రుచి తక్కువగా ఉంటుంది.
రసాయనాలతో మగ్గబెట్టిన అరటిపండ్లను వాటి రంగు ద్వారా కూడా గుర్తించొచ్చు. కార్బైడ్ తో మగ్గబెట్టిన అరటిపండ్ల రంగు లేత పసుపుగా ఉంటుంది.
సహజంగా పండించిన అరటిపండ్ల కంటే కృత్రిమంగా పండించిన అరటిపండ్లే తొందరగా పాడైపోతాయి. వీటి కింద నల్లగా ఉండి త్వరగా పాడవుతాయి.
కార్బైడ్ రసాయనంతో మగ్గబెట్టిన అరటిపండ్లను తింటే మన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.అలాగే వికారం, కళ్లలో మంట, వాపు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.