Food

చాక్లెట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదా?

ఫ్రిడ్జ్ లో పెడితే ఏం అవుతుంది?

చాక్లెట్ లోని కోకో బటర్ ఇతర ఆహార పదార్థాల వాసనలను త్వరగా పీల్చుకుంటుంది. వాటిని ఫ్రిడ్జ్ లో పెడితే చాక్లెట్ రుచి, వాసన పోతాయి.

 

 

టెక్చర్ మారుతుంది..

ఫ్రిజ్‌లో పెడితే చాక్లెట్ పైన తెల్లటి పొర ఏర్పడుతుంది, దీన్ని ‘బ్లూమింగ్’ అంటారు. కోకో బట్టర్, పంచదార పైకి వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. దీంతో చాక్లెట్ గరుకుగా, పొడిగా అవుతుంది.

తేమ పడుతుంది

ఫ్రిజ్‌లో తేమ ఉంటుంది. ఈ తేమ చాక్లెట్‌కి తగిలితే అది కరిగి మళ్ళీ గడ్డకడుతుంది. దీనివల్ల చాక్లెట్ పైన గులకలు గులకలుగా ఏర్పడతాయి. ఇది తినడానికి బాగోదు.

చాక్లెట్ ఎంతకాలం నిల్వ ఉంటుంది?

చాక్లెట్‌లోని పాల పరిమాణాన్ని బట్టి అది 10 నెలల నుండి రెండేళ్ల వరకు నిల్వ ఉంటుంది. డార్క్ చాక్లెట్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కానీ, ఫ్రిజ్‌లో కాకుండా వేరే చోట నిల్వ చేయండి.

అలమారలో పెట్టండి

చాక్లెట్‌ని అలమారలో నిల్వ చేయవచ్చు. కానీ, ఉష్ణోగ్రత 12 నుండి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే చాక్లెట్ కరిగిపోతుంది. అలమారలో తేమ ఉండకూడదు.

గాలి చొరబడని డబ్బాలో పెట్టండి

చాక్లెట్‌ని ఎక్కువ కాలం నిల్వ ఉంచాలంటే గాలి చొరబడని డబ్బాలో పెట్టండి. తేమ, వాసనలు పట్టకుండా ఉంటుంది.

జీలకర్ర -అల్లం వాటర్ తాగితే ఏమౌతుంది?

ఉప్పు ఎక్కువగా తింటే వచ్చే సమస్యలు ఇవే

బీట్ రూట్ జ్యూస్ రోజూ తాగితే ఏమౌతుంది?

భోజనం తర్వాత సోంపు నమిలితే ఏమౌతుంది?