Food
పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల గ్యాస్, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
పుచ్చకాయ తిన్న వెంటనే మాంసం, చేపలు వంటివి తినకూడదు. వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. కడుపునొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పుచ్చకాయ తిన్న వెంటనే గుడ్డు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులోని ఒమేగా 3, పుచ్చకాయలోని నీరు కలిసి జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.
పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పుచ్చకాయలోని పోషకాలు తగ్గిపోతాయి.
చాలా మంది పుచ్చకాయ ముక్కలపై ఉప్పు వేసుకొని తింటారు. ఇలా చేయడం మంచిది కాదు. ఇలా చేస్తే పుచ్చకాయలోని పోషకాలు తగ్గిపోవడమే కాకుండా రక్తపోటు వచ్చే అవకాశం ఉంది.
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు పుచ్చకాయ తింటే నిద్రకు భంగం కలుగుతుంది.