Food
బయోటిన్ అధికంగా ఉండే చిలగడదుంపను తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండే సాల్మన్ లాంటి చేపలు తినడం జుట్టు ఆరోగ్యానికి మంచిది.
ప్రోటీన్, జింక్, బయోటిన్, విటమిన్ డితో సహా జుట్టు ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు గుడ్డులో ఉంటాయి.
విటమిన్లు, జింక్, ఐరన్, ఫోలేట్ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.
ఒమేగా కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, బయోటిన్, జింక్ సమృద్ధిగా ఉండే బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి.
ప్రోటీన్, జింక్, బయోటిన్ సమృద్ధిగా ఉండే పప్పుదినుసులు తినడం జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే బెర్రీ పండ్లు తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.