Telugu

మీ క్రెడిట్ స్కోర్‌ పెంచుకోవాలా? ఈ 6 టిప్స్ మీకోసమే

Telugu

సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి?

మంచి సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీకు పిలిచిమరీ లోన్స్ ఇస్తాయి. మీ సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే కావాలని వేడుకున్నా లోన్స్ ఇవ్వవు. మరి సిబిల్ స్కోరు ఎలా పెంచుకోవాలి?

Image credits: Getty
Telugu

క్రెడిట్ కార్డ్ బిల్లులు టైమ్‌కి కట్టండి

పేమెంట్స్ ఆలస్యం చేయొద్దు! క్రెడిట్ కార్డ్ లేదా లోన్ వాయిదాలు టైమ్‌కి కట్టకపోతే మీ స్కోర్ పడిపోతుంది. పేమెంట్ మర్చిపోకుండా ఉండేందుకు ఆటో-పే సెట్ చేసుకోండి.

Image credits: Getty
Telugu

క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో తక్కువగా ఉంచండి

మీ క్రెడిట్ లిమిట్‌లో 30% కంటే తక్కువ వాడండి. ఉదాహరణకు మీ లిమిట్ ₹1,00,000 అయితే, ₹30,000 కంటే ఎక్కువ ఖర్చు చేయకండి.

Image credits: Getty
Telugu

ఎక్కువ లోన్లకు అప్లై చేయొద్దు

లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం మీరు ఎక్కువసార్లు అప్లై చేస్తే 'హార్డ్ ఎంక్వైరీ' జరుగుతుంది. దీనివల్ల మీ స్కోర్ తగ్గుతుంది. కాబట్టి అవసరమైతేనే అప్లై చేయండి.

Image credits: Getty
Telugu

పాత క్రెడిట్ కార్డులు క్లోజ్ చేయొద్దు

పాత క్రెడిట్ కార్డులు మీ క్రెడిట్ హిస్టరీని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా వాటి బిల్లులు టైమ్‌కి కట్టి ఉంటే చాలా మంచిది. మీ క్రెడిట్ హిస్టరీ ఎంత పాతదైతే, మీ స్కోర్ అంత బలంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

రకరకాల క్రెడిట్ వాడండి

కేవలం క్రెడిట్ కార్డులే కాకుండా హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటివి కూడా తీసుకోండి. వాటిని సరిగ్గా చెల్లిస్తే, మీ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ బాగుందని తెలుస్తుంది.

Image credits: Getty

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాప్ 5 భారతీయులు వీళ్లే

Corruption Index : ప్రపంచంలో అత్యంత అవినీతి దేశం ఏది? భారత్ ర్యాంకెంత?

Pakistani Products in India : ఇండియన్స్ వాడే పాకిస్థానీ వస్తువులివే

భర్త చనిపోయినా ఈ భారతీయ మహిళలు విధవలు కారు.. ఎందుకో తెలుసా?