విజయ్ కి ఈ ఒక్క సినిమాకి రూ.200 కోట్ల భారీ పారితోషికమా?
'GOAT' చిత్రం కోసం విజయ్ పారితోషికం
ప్రస్తుతం నటిస్తున్న 'GOAT' సినిమా కోసం విజయ్ తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
విజయ్ పారితోషికం ఎంత?
`గోట్` మూవీ నిర్మాత అర్చనా కల్పాతి ఇచ్చిన ఇంటర్వ్యూలో, విజయ్ ఈ మూవీ కోసం రూ.200 కోట్లు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
భారీ పారితోషికం తీసుకుంటున్న విజయ్
ఇంతటి భారీ రెమ్యూనరేషన్‌తో విజయ్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా నిలిచాడు.
ప్రభాస్, సల్మాన్ ల పారితోషికం?
పారితోషికం విషయంలో ప్రభాస్, సల్మాన్ ఖాన్ లను సైతం వెనక్కి నెట్టేశాడు విజయ్. ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ.125 కోట్లు తీసుకుంటున్నారు.
ఆమిర్, షారుఖ్ ల పారితోషికం?
ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లు మాత్రం పారితోషికం కాకుండా తాము సినిమా లాభాల్లో వాటాను తీసుకుంటున్నట్లు సమాచారం.
'GOAT' ఇప్పటికే హిట్:
'GOAT' చిత్రానికి రిలీజ్‌కి ముందే ఇంతటి రెస్పాన్స్ లభిస్తుండటంతో, ఈ సినిమా ఇప్పటికే హిట్ అయినట్లేనని నిర్మాత అర్చనా కల్పాతి అన్నారు.
విజయ్ 'GOAT' రిలీజ్ ఎప్పుడు?
వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఇది తమిళంతోపాటు తెలుగు, హిందీ వంటి భాషల్లోనూ అనువాదం అవుతుంది.