Entertainment

2024లో ఓపెనింగ్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 సినిమాలు

10. చిత్రం టిల్లు స్క్వేర్

రామ్ డైరెక్షన్ లో వచ్చిన 'టిల్లు స్క్వేర్' ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.23.6 కోట్లు రాబట్టింది. ఈ మూవీలో సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ, ప్రియాంక, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.

9. తంగలాన్

 విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు నటించిన 'తంగలాన్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున రూ.24 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీకి పా. రంజిత్ దర్శకత్వం వహించారు.

8. బడే మియా చోటే మియా

అక్షయ్ కుమార్-టైగర్ ష్రాఫ్ నటించిన 'బడే మియా చోటే మియా' చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున రూ.30.8 కోట్లు వసూలు చేసింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు.

7. ఫైటర్

హృతిక్ రోషన్- దీపికా పదుకొనే నటించిన 'ఫైటర్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున రూ.37.8 కోట్లు వసూలు చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.

6. ఇండియన్ 2

స్టార్ డైరెక్టర్ శంకర్ మూవీ ఇండియన్ 2 ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున రూ.56.2 కోట్లు వసూలు చేసింది. కమల్ హాసన్, సిద్దార్ద్ లు  ఈ చిత్రంలో నటించారు.  
 

5. గుంటూరు కారం

మహేష్ బాబు, శ్రీలీల నటించిన గుంటూరు కారం చిత్రం విడుదలైన మొదటి రోజున రూ.73.2 కోట్లు వసూలు చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

4. స్త్రీ 2

రాజ్‌కుమార్ - రావ్-శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున రూ.80.2 కోట్లు వసూలు చేసింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు.

3. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం

తమిళ స్టార్ హీరో విజయ్ చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున రూ.101.2 కోట్లు వసూలు చేసింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు.

2. దేవర

జూనియర్ ఎన్టీఆర్-జాన్వి కపూర్ నటించిన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున రూ.172 కోట్లు వసూలు చేసింది. కొరటాల శివ దర్శకత్వం వహించారు.

1. కల్కి 2898 AD

ప్రభాస్ - దీపికా పదుకొనే నటించిన కల్కి 2898 AD 2024లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా రూ.182.6 కోట్లు రాబట్టింది.

Find Next One