ప్రియాంక చోప్రా తన కూతురికి మాల్తీ మేరీ అని పేరెందుకు పెట్టిందో తెలుసా
ప్రియాంక, నిక్ జోనస్
హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లు తమ గారాల పట్టీకి మాల్తీ మేరీ అనే పేరు పెట్టారు.
ప్రియాంక కూతురి పేరు
ఏదేమైనా సెలబ్రిటీలు తమ పిల్లలకు ప్రత్యేకమైన, లేటెస్ట్ పేర్లను పెడుతుంటారు. కానీ ప్రియాంక, నిక్ లు మాత్రం తమ కూతురుకి మాల్తీ మేరీ అని పేరు పెట్టారు. ఇదైతే పాత పేరే.
మాల్తీ మేరీ పేరు వెనుక కారణం
మాల్తీ పేరు ప్రియాంత తన తల్లి డాక్టర్ మధు మాల్తీ చోప్రా పేరు. ఇక మేరీ అనేది అత్త డెనిస్ మేరీ జోనస్ లో ఉన్న సగం పేరు అని ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
మాల్తీ అంటే అర్థం?
మాల్తీ అంటే మల్లెపూవు అని అర్థం వస్తుంది. అలాగే జాజికాయ, చంద్రకాంతి, రాత్రి అని కూడా అర్థాలు వస్తాయి.
మేరీ అంటే అర్థం?
మేరీ లాటిన్ పదంలోని స్టెల్లా మేరిస్ నుంచి ఉద్బవించింది. ఈ పేరుకు సముద్ర నక్షత్రం లేదా సముద్రపు చుక్క అని అర్థం వస్తుంది.
ప్రియాంక చోప్రా కూతురు
2022 లో ప్రియాంక, నిక్ ల కూతురు సరోగసీ ద్వారా జన్మించింది. అయితే ఈ విషయాన్ని మాల్తీ మేరీ పుట్టిన మూడు నెలల తర్వాత వెల్లడించారు.