Entertainment

తమన్నా ఆస్తుల విలువ

Image credits: instagram

కలిసొచ్చిన దక్షిణాది సినిమాలు:

ముంబైకి చెందిన మిల్క్ బ్యూటీ తమన్నా బాలీవుడ్‌లో అరంగేట్రం చేసినా, ఆమెకు కలిసొచ్చింది దక్షిణాది సినిమాలే. తెలుగు సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

Image credits: instagram

తెలుగులో శ్రీతో అరంగేట్రం:

 `శ్రీ` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా, తర్వాత తమిళంలో రవికృష్ణతో 'కేడి'లో నటించింది.

Image credits: instagram

`హ్యాపీ డేస్‌` తో బ్రేక్

తెలుగులో చేసిన `హ్యాపీడేస్‌` మూవీ తమన్నాకి మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఈ సినిమాతో ఆమె ఇక్కడ ఫుల్‌ బిజీ అయ్యింది. 

Image credits: instagram

స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తమన్నా:

తెలుగు, తమిళ సినిమాల్లో వరుసగా నటించిన తమన్నా, 2009, 2010, 2011లలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి మహేష్‌, పవన్‌, ఎన్టీఆర్‌, బన్నీ, చరణ్‌, ప్రభాస్‌ వంటి స్టార్స్ అందరితోనూ జోడీ కట్టింది.

Image credits: instagram

అరణ్మనై 4తో వంద కోట్లు

ఈ ఏడాది తమిళంలో సుందర్.సి దర్శకత్వంలో  నటించిన 'అరణ్మనై 4' 100 కోట్లు వసూలు చేసింది.

Image credits: instagram

కొత్త సినిమాలు:

ప్రస్తుతం ఆమె చేతిలో 2 హిందీ సినిమాలు, ఒక తెలుగు సినిమా `ఓడెల 2` ఉన్నాయి.

Image credits: instagram

పెళ్లి:

త్వరలోనే తన ప్రియుడు విజయ్‌ వర్మని తమన్నా పెళ్లి చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు.  

Image credits: Tamannaah Bhatia/instagram

తమన్నా నికర ఆస్తి:

18 ఏళ్లకు పైగా సినీ రంగంలో ఉన్న తమన్నా నికర ఆస్తి 120 కోట్లని చెబుతున్నారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారం మాత్రమే.

Image credits: Tamannaah Bhatia/instagram

సంవత్సర ఆదాయం:

సంవత్సరానికి తమన్నా దాదాపు 12 కోట్లు సంపాదిస్తుంది. సినిమాలు, యాడ్స్, సోషల్‌ మీడియా పోస్ట్ లు, ఈవెంట్ల ద్వారా తమన్నా బాగానే సంపాదిస్తుంది.

Image credits: Tamannaah Bhatia/instagram

సినిమా పారితోషికం:

ఒక్కో సినిమాకి దాదాపు 4-5 కోట్లు పారితోషికంగా తీసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది.

Image credits: Social Media

బ్రాండ్ అంబాసిడర్:

ఫాంటా, మొబైల్ ప్రీమియర్ లీగ్ వంటి బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంది. దీని ద్వారా కూడా మంచి ఆదాయం వస్తుంది.

Image credits: Social Media

అపార్ట్‌మెంట్ విలువ:

జూహులోని బేవ్యూ అపార్ట్‌మెంట్‌లో 14వ అంతస్తులో 16 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ ఉంది.

Image credits: Social Media

కార్ కలెక్షన్:

ల్యాండ్ రోవర్, BMW, మెర్సిడెస్ బెంజ్, మిట్సుబిషి పజెరో వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

Image credits: Social Media

ప్రియుడి కంటే ఎక్కువ ఆస్తి:

విజయ్ వర్మ ఆస్తి 20 కోట్లు మాత్రమే. తమన్నా ఆస్తి దానికంటే 5 రెట్లు ఎక్కువ కావడం విశేషం. 

Image credits: Social Media

కత్రినా కైఫ్ ఫిట్‌నెస్ రహస్యాలు

బేబీ జాన్ మూవీ తేరి రీమేక్ కాదా ? క్లారిటీ ఇచ్చిన అట్లీ 

దీపికా నుంచి అనుష్క శర్మ వరకు : వారి పిల్లల పేర్లకు అర్థాలు ఇవే

మన తారలకు ఈ టిఫిన్‌ అంటే ప్రాణం.. అందరి సమాధానం ఒక్కటే