మన తారలకు ఈ టిఫిన్ అంటే ప్రాణం.. అందరి సమాధానం ఒక్కటే
Image credits: SocialMedia
దుల్కర్ సల్మన్
స్టార్ హీరో దుల్కర్ సల్మన్‌కు ఇడ్లీ అంటే చాలా ఇష్టమంటా. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు.
Image credits: face book
ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కూడా ఇడ్లీ అంటే చాలా ఇష్టమని పలుసార్లు తెలిపారు. లక్ష్మీ టాక్ షోలా మాట్లాడుతూ అర్థ రాత్రుళ్లు టిఫిన్ బండ్లపై ఇడ్లీలను తినేవాడినని చెప్పుకొచ్చారు.
Image credits: Social Media
దీపికా
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణె సైతం ఇడ్లీని ఎంతో ఇష్టంగా తింటానని పలుసార్లు తెలిపారు. తన ఫస్ట్ ప్రయారిటీ ఇడ్లీ అంటా.
Image credits: instagram
మహేష్ బాబు
మహేష్ బాబు ఇడ్లీలను ఎంతో ఇష్టపడతారంటా. టీ లో ఇడ్లీలను ముంచుకుని తినేవాడినని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
Image credits: Social Media
నిధి అగర్వాల్
అందాల తార నిధి అగర్వాల్ సైతం తన ఫేవరేట్ ఏంటి అని అడగ్గా.. ఇడ్లీ అనే సమాధానం ఇచ్చింది.
Image credits: our own
రాజశేఖర్
సీనియర్ రాజశేఖర్ సైతం పలు సందర్భాల్లో తనకు ఇష్టమైన ఫుడ్ ఇడ్లీనేనని చెప్పుకొచ్చారు.
Image credits: Google
అదితి రావు
తెలుగుమ్మాయి అదితి రాయ్‌కి ఇడ్లీ అంటే చాలా ఇష్టమంటా. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఇలా ఎప్పుడైనా ఇడ్లీని తింటానని చెప్పుకొచ్చింది.