Entertainment
2018లో వచ్చిన 'స్త్రీ' తర్వాత 2024లో ఇటీవల 'స్త్రీ 2' విడుదలయింది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ ఓ సాధారణ మహిళలా కనిపించే దయ్యం పాత్రలో నటించింది.
'స్త్రీ' తర్వాత మ్యాడ్డాక్ ఫిల్మ్స్ సూపర్ నాచురల్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన రెండో చిత్రం 'రూహి'లో జాన్వీ కపూర్ ఓ దయ్యం పాత్ర పోషించింది.
రొమాంటిక్ కామెడీ చిత్రం 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'లో ఉర్వశి రౌతెలా రాగిని అనే దయ్యం పాత్రలో అలరించింది. ముగ్గరు హీరోలని ఆమె తన మాయలో పడేసే పాత్రలో నటించింది.
'ఫోన్ భూత్'లో కత్రినా కైఫ్ రాగిని అనే దయ్యం పాత్ర పోషించింది. ఇందులో ఆమె ఇద్దరు యువకులు మేజర్ (సిద్ధాంత్ చతుర్వేది), గుల్లు (ఇషాన్ కట్టర్) లకు డబ్బు సంపాదించడంలో సహాయం చేస్తుంది.
2000 సంవత్సరంలో వచ్చిన 'మొహబ్బతే'లో ఐశ్వర్య రాయ్ అమితాబ్ బచ్చన్ కూతురిగా నటించింది. ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ తన ప్రియుడిని (షారుఖ్ ఖాన్) కలవడానికి ఆత్మగా తిరిగి వస్తుంది.
కార్తీక్ ఆర్యన్ నటించిన 'భూల్ భూలయ్యా 2'లో టబు అంజులికా అనే దయ్యం పాత్ర పోషించింది. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి తన కవల సోదరి మంజులికతో పోరాడుతుంది.
షారుఖ్ ఖాన్ నటించిన 'ఓం శాంతి ఓం'లో దీపికా పదుకొణె ఓ నటి ఆత్మగా కనిపిస్తుంది. ఆమెను ఆమె సహనటుడే చంపేస్తాడు. తన మరణానికి ప్రతీకారం తీర్చుకుంటుంది.
అనుష్కా శర్మ రెండు చిత్రాల్లో దయ్యం పాత్రలు పోషించింది. 'పరీ', 'ఫిల్లౌరి' చిత్రాల్లో ఈ తరహా పాత్రల్లో కనిపించింది.
ఆమిర్ ఖాన్ నటించిన 'తలాష్ : ది ఆన్సర్ లైస్ విత్ ఇన్'లో కరీనా కపూర్ దయ్యం పాత్ర పోషించింది. సినిమా చివరి వరకు ఆ పాత్రపై సస్పెన్స్ కొనసాగుతుంది.
అజయ్ దేవగణ్ నటించిన 'గోల్ మాల్ అగైన్'లో పరిణీతి చోప్రా ప్రతీకార దాహంతో తిరుగుతున్న ఆత్మ పాత్రలో కనిపించింది. ఈ హర్రర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది.