Entertainment

2024లో కొత్త జంటలు: టాప్ 10 జోడీలు

2024 నూతన జంటలు

2024లో చాలా కొత్త జంటలు వెండితెరపై కనిపించారు. కార్తీక్ ఆర్యన్-త్రిప్తి డిమిరి నుండి హృతిక్ రోషన్-దీపికా పదుకొనే వరకు, అనేక కొత్త జంటలు బాక్సాఫీస్ వద్దసందడి చేశాయి. 

1. హృతిక్ రోషన్-దీపికా పదుకొనే

హృతిక్ రోషన్, దీపికా పదుకొనే తొలిసారిగా `ఫైటర్` సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 344.46 కోట్లు వసూలు చేసింది.

2. షాహిద్ కపూర్-కృతి సనన్

షాహిద్ కపూర్, కృతి సనన్ 'తేరి బాటన్‌ మెయిన్‌ ఐసా ఉల్జా జియా`లో కలిసి నటించారు. ఇది వారి తొలి చిత్రం. ఈ సినిమా 133.64 కోట్లు వసూలు చేసింది.

3. కార్తీక్ ఆర్యన్-త్రిప్తి డిమిరి

భూల్ భూలయ్యా 3 బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. చిత్రంలో కార్తీక్ ఆర్యన్, త్రిప్తి డిమిరి నటించారు. ఈ చిత్రం 421.02 కోట్లు రాబట్టింది.

4. ప్రభాస్-దీపికా పదుకొనే

ప్రభాస్, దీపికా పదుకొనే, దిశాపటానీ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం `కల్కి 2898 AD`లో నటించారు. ఈ చిత్రం 1200 కోట్లు వసూలు చేసింది.

5. జూనియర్ ఎన్టీఆర్-జాన్వీ కపూర్

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన `దేవర` సినిమా బాక్సాఫీస్ వద్ద 521 కోట్లు వసూలు చేసింది. ఇది వారి తొలి చిత్రం.

6. కత్రినా కైఫ్-విజయ్ సేతుపతి

కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి తొలిసారిగా `మెర్రీ క్రిస్మస్‌`లో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 26.02 కోట్లు వసూలు చేసింది.

7. అక్షయ్ కుమార్-రాధిక మదన్

అక్షయ్ కుమార్, రాధిక మదన్ తొలిసారిగా `సెల్ఫీ` చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 30.02 కోట్లు వసూలు చేసింది.

8. రాజ్‌కుమార్ రావు-త్రిప్తి డిమిరి

రాజ్‌కుమార్ రావు, త్రిప్తి డిమిరి 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' చిత్రంలో నటించారు. ఇది ఈ జంట తొలి చిత్రం. ఈ సినిమా 55.51 కోట్లు వసూలు చేసింది.

9. సూర్య-దిశా పటాని

దక్షిణాది నటుడు సూర్య, బాలీవుడ్ నటి దిశా పటాని `కంగువ`లో కలిసి నటించారు. ఇద్దరు స్టార్స్ కలిసి నటించిన తొలి చిత్రమిది. ఈ చిత్రం 106 కోట్ల వసూలు చేసింది.

10. అజయ్ దేవగన్-జ్యోతిక

అజయ్ దేవగన్, జ్యోతిక నటించిన 'సైతాన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద 211 కోట్లు వసూలు చేసింది. ఇద్దరు స్టార్స్ కలిసి నటించిన తొలి చిత్రమిది.

సమంత, సోనమ్‌, మిథున్‌.. 2024లో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న స్టార్స్

80ల హీరోయిన్లు జయప్రద,మీనాక్షి, రతి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

2024లో సీక్వెల్ సినిమాల హవా, పుష్ప 2, స్ట్రీ2, సింగం ఎగైన్‌

Rewind 2024: ఓటీటీలో ఉన్న బెస్ట్ హారర్ మూవీస్