Entertainment

పార్టీలో తాగేసి టబుకి ముద్దు పెట్టిన నటుడు ?..ఆమె సోదరి ఏం చేసిందంటే

జాకీపై తీవ్ర ఆరోపణలు

జాకీ ష్రాఫ్ ఎప్పుడూ బాధ్యత రాహిత్యంగా ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. చాలా వివాదాల్లో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. 

38 ఏళ్ల క్రితం జాకీ వివాదం

మనం మాట్లాడుకుంటున్న వివాదం 38 ఏళ్ల క్రితం నాటిది. 1986లో జరిగింది. జాకీ ష్రాఫ్ ఆ సమయంలో 'దిల్జలా' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఫరా నాజ్ ఆయనకి జంటగా నటించారు.

ఫరాతో పాటు ఆమె చెల్లి టబు

'దిల్జలా' షూటింగ్ మారిషస్‌లో జరుగుతోంది. ఫరాతో పాటు ఆమె చెల్లి టబు కూడా సెట్‌లో ఉన్నారు, ఆ సమయంలో ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు.

డానీ పార్టీ ఇచ్చారు

'దిల్జలా'లో డానీ డెంజోంగ్పా కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన ఓ పార్టీ ఇచ్చారు, సినిమాలోని మొత్తం టీమ్‌ని ఆహ్వానించారు. జాకీ ష్రాఫ్, ఫరా నాజ్, టబు తో సహా టీం హాజరైంది.

పార్టీలో మద్యం తాగి జాకీ

వార్తల ప్రకారం డానీ పార్టీలో జాకీ మద్యం తాగి తూలిపోయి. టబును బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించారు. డానీ జోక్యం చేసుకుని జాకీని టబు నుండి దూరంగా లాగారు.

తర్వాత రోజు ఫరా నాజ్

డానీ ఆ రాత్రి విషయాన్ని సర్దుబాటు చేసినప్పటికీ, తర్వాత రోజు ఉదయం ఫరా నాజ్ గొడవ చేశారు. జాకీ మద్యం మత్తులో తన సోదరితో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించారని ఆమె మీడియాకు చెప్పారు.

దుమారం రేగింది

ఈ విషయంపై చాలా దుమారం రేగింది. ఫరా, జాకీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. తర్వాత ఫరా స్వయంగా వివరణ ఇచ్చి కొంత అపార్థం జరిగిందని చెప్పారు.

టబు మాత్రం మౌనం

ఈ వ్యవహారంపై టబు మౌనం పాటించారు. అయితే ఆమె ఎప్పుడూ జాకీ ష్రాఫ్ సరసన నటించలేదు. అయితే, వీరిద్దరూ 'బోర్డర్', '2001', 'భారత్' వంటి చిత్రాల్లో కనిపించారు.

షారూఖ్ ఖాన్ ఇంటిలోపల ఎలా ఉంటుందో చూశారా

2024లో సౌత్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చేందుకు సిద్దమైన నార్త్ సరుకు!

దేశీ బార్బీ అలియా భట్, చందేరి సిల్క్ సూట్ ధర ఎంతో తెలుసా?

అజిత్ కు ఇన్ని ఆస్తులు ఉన్నాయా..? కార్లు ..బైక్ లు ఎన్ని కోట్లంటే..?