కీర్తి సురేష్ సౌత్ ఇండియా స్టార్ లేడీ. మహానటి మూవీతో భారీ ఫేమ్ రాబట్టింది. ఈ చిత్రంలో నటనకు జాతీయ అవార్డు అందుకుంది.
Image credits: Instagram
మహేష్, పవన్ లకు జంటగా
కీర్తి సురేష్ టాలీవుడ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, మహేష్ కి జంటగా సర్కారు వారి పాట చిత్రాలు చేసింది.
Image credits: Instagram
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు
కీర్తి సురేష్ మహానటి అనంతరం పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. పెంగ్విన్, గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా, రఘు తాత చిత్రాల్లో కీర్తి ప్రధాన పాత్రలు చేసింది.
Image credits: Instagram
బాలీవుడ్ ఎంట్రీ
బేబీ జాన్ మూవీతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ తేరి రీమేక్. డిసెంబర్ 25న విడుదల కానుంది.
Image credits: Keerthy Suresh/instagram
భారీ రెమ్యునరేషన్
బేబీ జాన్ కొరకు కీర్తి సురేష్ భారీ రెమ్యునరేషన్ రాబడుతుందని సమాచారం. గతంలో రూ. 3 కోట్లు తీసుకున్న కీర్తి సురేష్ రూ. 4 కోట్లకు పెంచిందట.
Image credits: Keerthy Suresh/instagram
కీర్తి సురేష్ వివాహం
కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంటోని తట్టిల్ ని పెళ్లి చేసుకుంది. డిసెంబర్ 12న గోవా వేదికగా వీరి వివాహం జరిగింది.
.
Image credits: Instagram
15 ఏళ్ల రిలేషన్
కీర్తి సురేష్- ఆంటోని దాదాపు 15 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. ఆంటోని దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త అని సమాచారం.