Entertainment

ఈ `కల్కి`, `కంగువా` హీరోయిన్‌ ఆస్తుల విలువెంతో తెలుస్తే షాకే

దిశా పటాని తక్కువ సమయంలోనే పాపులర్

తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో పేరు తెచ్చుకుని ఇప్పుడు సౌత్ లోనూ రాణిస్తున్న ఈ నటి ఎవరో తెలుసా? దిశా పటానీ, తెలుగులో `కల్కి2898ఏడీ`లో రచ్చ చేసింది. ఇప్పుడు `కంగువా`తో అదరగొట్టింది

బరేలీ అమ్మాయి బాలీవుడ్‌లో సత్తా చాటింది

8 ఏళ్ల క్రితం బరేలీ నుండి హీరోయిన్ కావాలని వచ్చిన దిశా పటానీ తెలుగులో వచ్చిన `లోఫర్‌` సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. 

దిశా పటాని సినీ రంగ ప్రవేశం

2016లో వచ్చిన 'ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాతో దిశా పటాని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశా పటాని రూ.75 కోట్ల ఆస్తిపరురాలు

సోషల్ మీడియా సమాచారం మేరకు.. దిశా పటానికి దాదాపు రూ.75 కోట్ల ఆస్తి ఉంది. సినిమాలతో పాటు బ్రాండ్ అడ్వర్టైజ్‌మెంట్స్ ద్వారా కూడా ఆమె బాగానే సంపాదిస్తుంది.

దిశా పటాని లగ్జరీ ఇల్లు

కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత దిశా పటాని ముంబైలో రూ.5 కోట్ల విలువైన ఇల్లు కొనుక్కుంది. ఈ ఇంటి ఇంటీరియర్ ని చాలా అందంగా డిజైన్‌ చేయించింది.

దిశా పటాని ఒక్కో సినిమాకి రూ.3-5 కోట్లు

దిశా పటాని ఒక్కో సినిమాకి రూ.3-5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. బ్రాండ్ అడ్వర్టైజ్‌మెంట్ కి రూ.1.5 కోట్లు తీసుకుంటుంది. ఆమె వార్షిక ఆదాయం దాదాపు రూ.12 కోట్లకుపైనే ఉంటుందని టాక్‌.

దిశా పటాని కార్ల కలెక్షన్

దిశా పటాని దగ్గర రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్, జాగ్వార్ ఎఫ్-పేస్, మెర్సిడెస్ బెంజ్ సి200, హోండా సివిక్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

దిశా పటాని నటించిన సినిమాలు

ఈ ఏడాది దిశా పటాని 'యోధా', 'కల్కి 2898 AD', 'కుంగువ' సినిమాల్లో నటించింది. ఆమె నటించిన 'వెల్కమ్ టు ది జంగిల్' సినిమా 2025లో విడుదల కానుంది.

దీపికా ప్రియులు: రణ్‌వీర్ కంటే ముందు ఎవరు?

2024లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ తో ఆదరణ పొందిన చిత్రాలు ఇవే

కంగువ విలన్ బాబీ డీయోల్ జీవితం ఇంత లగ్జరీగా ఉంటుందా

విడుదలకు నోచుకోలేని ధనుష్‌ సినిమాలు లిస్ట్, ఇది నిజంగా షాకే