Entertainment
హీరోయిన్ పార్వతి ట్యాలెంటెడ్ నటిగా గుర్తింపు పొందింది. బెంగుళూరు డేస్, చార్లీ, టేక్ ఆఫ్, ఉయారే వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో నటించారు.
నయనతార పెరిగింది కేరళలోనే. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కూడా మలయాళీ చిత్రాలతోనే. కానీ ఇప్పుడు నయన్ సౌత్ లో లేడీ సూపర్ స్టార్.
మలయాళ సినిమాలో ప్రముఖ నటి అయిన కావ్య మాధవన్ బాల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. మీసా మాధవన్, పెరుమాళక్కళం, గడ్డామ వంటి ప్రసిద్ధ చిత్రాలలో నటించారు.
భావన మలయాళ సినిమాలో ప్రముఖ నటిగా ఉన్నారు, క్రానిక్ బ్యాచిలర్, నమ్మల్, దైవనామతిల్, హనీ బీ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు. తెలుగులో కూడా భావన కొన్ని చిత్రాల్లో నటించింది.
నటి,ప్లేబ్యాక్ సింగర్ అయిన మమ్తా మోహన్‌దాస్ బిగ్ బి, అన్వర్, టూ కంట్రీస్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో యమదొంగ, చింత కాయల రవి లాంటి హిట్ చిత్రాల్లో నటించింది.
నిత్య మీనన్ ఒక ప్రతిభావంతులైన నటి, ఆమె ఉస్తాద్ హోటల్, బెంగుళూరు డేస్, మెర్సల్ ,ప్రాణ వంటి చిత్రాలలో నటించారు. తెలుగులో నిత్యామీనన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మలయాళ సినిమాలో "లేడీ సూపర్ స్టార్" అని పిలువబడే మంజు వారియర్.. కన్నెజుతి పొట్టం తొట్టు మరియు లూసిఫర్ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందారు.