Cricket
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇటీవల ఆమె ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు కెప్టెన్సీ కూడా వహించింది.
ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో స్మృతి మంధాన కేవలం 70 బంతుల్లోనే శతకం సాధించింది. 80 బంతుల్లో 134 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది.
క్రికెట్ కాకుండా స్మృతి మంధాన వ్యక్తిగత జీవితంలో కూడా చర్చనీయాంశం అవుతుంటుంది. ఆమెకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం.
స్మృతి మంధాన దగ్గర ఖరీదైన, లగ్జరీ కార్లు ఉన్నాయి.
ఈ క్రికెటర్ దగ్గర చాలా కార్లు ఉన్నాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హ్యుండై క్రెటా, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ ఇవోక్, ఆడి, బిఎండబ్ల్యు కార్లు ఆమె కలెక్షన్‌లో ఉన్నాయి.
తన కెరీర్ ప్రారంభంలో స్మృతి మంధాన మొదటగా మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కొనుగోలు చేసింది. ఆ క్షణం ఆమెకు చాలా గొప్పది. తనకి ఇష్టమైనది కూడా ఇదే.
అక్టోబర్ 2022లో మంధాన సిలికాన్ సిల్వర్ కలర్‌లో ఈ కారుని కొనుగోలు చేసింది. అప్పట్లో దీని ఎక్స్‌షోరూమ్ ధర 72.09 లక్షల రూపాయలు.