Cricket
26 ఏళ్ల ప్రియా సరోజ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మచిలీషహర్ నుండి గెలిచారు. భారతదేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఎంపీలలో ఒకరు.
ప్రియా సరోజ్ ఢిల్లీ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్, అమిటీ యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.బి. పూర్తి చేశారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేశారు.
ఎంపీ ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా, ప్రస్తుతం కెరాకత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి ప్రోత్సాహంతోనే ప్రియా సరోజ్ రాజకీయాల్లోకి వచ్చారు.
ప్రియా సరోజ్ పార్లమెంటు సామాజిక న్యాయం, హక్కుల కమిటీ సభ్యురాలు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారు.
KKR కీలక ఆటగాడు, ఐపీఎల్ లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్ తో ప్రియా సరోజ్ కి నిశ్చితార్థం అయిందని ప్రచారం జరుగుతోంది.
అయితే, క్రికెటర్ రింకూ సింగ్ తో ప్రియా సరోజ్ పెళ్లి చర్చలు జరుగుతున్నాయని, నిశ్చితార్థం అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఆమె తండ్రి స్పష్టం చేశారు.
రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, ప్రియా సరోజ్ ప్రగతిశీల నాయకురాలిగా ఎదిగారు. చదువు, రాజకీయ అనుభవం, యువతతో సత్సంబంధాల కారణంగా కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
రాజకీయాల్లో వేగంగా ఎదిగిన ప్రియా సరోజ్ చాలా మంది యువతకు ఆదర్శం. రింకూ సింగ్ తో పుకార్లు నిజమైనా కాకపోయినా, ఆమె ప్రతిభ, సేవలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.