Cricket
ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్, రింకు-ప్రియల ప్రేమని ధృవీకరించారు.
నిశ్చితార్థం వార్త తర్వాత.. రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఎలా కలిశారనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉంది.
ప్రియా తండ్రి చెప్పినదాని ప్రకారం.. తన స్నేహితుల్లో క్రికెటర్ ఉన్నారు. అతని ద్వారా రింకూ సింగ్, ప్రియా సరోజ్ కలిశారు. ఆ తర్వాత వీరు దగ్గరయ్యారు.
బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తామని ప్రియా తండ్రి తెలిపారు. 26 ఏళ్ల ప్రియా సరోజ్, యూపీలోని మచ్లిషహర్ నుండి అతి పిన్నవయస్కురాలైన ఎంపీగా ఘనత సాధించారు.