శుక్రుడిని దట్టమైన మేఘాలు కప్పేసి ఉంటాయి. ఇవి కాస్టిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్‌తో నిండి ఉంటాయి.
ఆ వాతావరణంలో సూక్ష్మజీవులు జీవించగలిగే అవకాశం ఉందా? లేదా? అన్నది పరిశీలించడానికి చైనా ప్రయోగం చేయనుంది.
2033 నాటికి శుక్రుడి మేఘం, వాతావరణ నమూనాలను పరిశీలించి సూక్ష్మజీవుల ఉనికిని తెలుసుకోవడానికి చైనా వీనస్ నమూనా-రిటర్న్ మిషన్‌ను ప్లాన్ చేస్తోంది.
ఇలాాంటి ప్రయోగాన్ని గతంలో ఏ దేశం చేయలేదు. చైనా మొదటిసారి శుక్ర గ్రహంపై ఇలాంటి ప్రయోగం చేస్తోంది.
శుక్ర గ్రహ వాతావారణాన్ని పరిశీలించడం ద్వారా భవిష్యత్ లో భూమి కూడా ఇలానే మారే ప్రమాదం ఉందా అన్నది కూడా అంచనా వేస్తారు.
ఈ ప్రయోగం ద్వారా ఒక ప్రోబ్ లేదా డ్రోన్ ను శుక్రగ్రహం మేఘాలలో పంపించి, అక్కడ వాయువులు, ధూలికణాలు సేకరించి పరీక్ష చేస్తారు.
చైనా ఇలాంటివి రహస్యంగా అనేక ప్రయోగాలు చేసింది. కొన్ని దుష్పరిణాలు కూడా ఇచ్చాయి. మరి ఇది ఎలాంటి ఫలితాలిస్తుందో వేచి చూడాలి.
గురు, కుజ గ్రహాల మధ్య గ్రహం ఉందా? సైంటిస్టులే ఆశ్చర్యపోయారు
డిజిటల్ స్క్రీన్స్‌కి దూరంగా ఉంటే ఇన్ని లాభాలా!
ప్రపంచంలో అతిపెద్ద టాప్-10 కంపెనీలు ఇవే
మీ భార్యకు గిఫ్ట్ ఇవ్వడానికి ఈ కమ్మలు బెస్ట్ ఆప్షన్!