కుజ(Mars) గురు(Jupiter) గ్రహాల మధ్యలో ఒక గ్రహం ఉందని ఒకప్పుడు సిద్ధాంతం ఉంది. దీనిని టిటియస్-బోడ్ నియమం (Titius–Bode Law) అంటారు.
ఈ నియమం ప్రకారం గ్రహాలు సూర్యుడి చుట్టూ ఒక ప్రత్యేకమైన దూరంలో తిరుగుతూ ఉండాలి. కానీ కుజ, గురు గ్రహాల మధ్య ఖాళీగా ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ ఒక గ్రహం ఉందని సైంటిస్టులు ఊహించారు.
అయితే అక్కడ గ్రహం బదులు శాస్త్రవేత్తలు అక్కడ ఒక ఆస్టరాయిడ్ బెల్ట్ (Asteroid Belt) ను కనుగొన్నారు. ఇది భారీ రాళ్ల మిశ్రమం.
ఈ బెల్ట్‌లో అతిపెద్ద రాయి సెరెస్(Ceres). దీన్ని 1801లో కనుగొన్నారు. మొదట సెరెస్‌ను ఒక గ్రహంగా పరిగణించారు. కానీ తరువాత మరిన్ని ఇదే రకమైన రాళ్లు కనుగొనడంతో ఇది గ్రహం కాదన్నారు.
అక్కడ ఒక గ్రహం ఏర్పడే ప్రయత్నం జరిగింది. కానీ జూపిటర్ గురుత్వాకర్షణ ప్రభావం వల్ల అక్కడి పదార్థాలు వేగంగా ఢీకొని గ్రహంగా మారలేకపోయాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.