business
మీరు కొత్త జాబ్‌లోకి వెళ్లాలనుకున్నా, అసలు మీరు పనిచేసే సెక్టార్ మార్చాలనుకున్నా ఈ ఏడు బెస్ట్ టిప్స్ తప్పక పాటించండి.
ప్రస్తుతం మీరు చేస్తున్న జాబ్ లో మీకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. అదేంటో గుర్తించండి. కమ్యూనికేషన్, సమస్య పరిష్కారం, నాయకత్వం ఇలాంటివి.
మీరు మారాలనుకున్నజాబ్ లేదా ఫీల్డ్ గురించి పూర్తి వివరాలు సేకరించండి. మీకున్న నైపుణ్యాలు అక్కడ ఎలా ఉపయోగించాలో ఆలోచించండి.
మీ కొత్త ఉద్యోగానికి లేదా సెక్టార్‌కి అవసరమైన కొత్త విషయాలను నేర్చుకోండి. వాటిని మీ రెజ్యూమ్ లో చేర్చండి.
మీ ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేసే ముందు మీరు ఇష్టపడే రంగంలో చిన్న ప్రాజెక్ట్‌లను చేసి చూడండి. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది.
కొత్త రంగంలోకి ప్రవేశించడానికి ముందు ఆ రంగంలో ఉన్న వారితో కాంటాక్ట్స్ పెంచుకోండి. అది కొత్త ఉద్యోగానికి కూడా వర్తిస్తుంది.
మీరు జాబ్ మారాలనుకుంటే ముందు మీ రెజ్యూమ్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోండి. మీకున్న నైపుణ్యాలన్నీ అందులో వివరించండి.
మీరు ప్రస్తుతం ఉన్న సెక్టార్ నుంచి కొత్త దాంట్లోకి మారి నిలదొక్కుకోవాలంటే పట్టుదల ఉండాలి. కొత్త ఫీల్డ్ లో వచ్చే ఒడిదొడుకులను తట్టుకొని నిలబడగలిగితే విజయం ఈజీ.