business

వెరీ చీప్ డ్యూడ్.. రూ. 2కే లీటర్‌ పెట్రోల్‌.. ఎక్కడో తెలుసా.?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)

తక్కువ ధరలున్న దేశంలో యూఏఈ 10వ స్థానంలో ఉంది. ఇక్కడ సగటున లీటర్ పెట్రోల్ ధర 0.716 డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 62.69గా ఉంది. 

రష్యా

రష్యాలో లీటర్ పెట్రోల్ ధర సగటున 0.629 డాలర్లు (54.72 రూపాయలు)గా ఉంది. 

సౌదీ అరేబియా

సౌదీ అరేబియాలో కూడా పెట్రోల్ తక్కువ ధరకే లభిస్తుంది. ఇక్కడ సగటున లీటర్ పెట్రోల్ ధర 0.621 డాలర్లు (54.02 రూపాయలు)గా ఉంది. 

కజకిస్తాన్

ఈ దేశంలో పెట్రోల్ ధర సగటున  లీటరుకు 0.483 డాలర్లు (42.02 రూపాయలు)గా ఉంది. 

కువైట్

తక్కువ పెట్రోల్ ధరలు ఉన్న దేశాల్లో కువైట్ ఒకటి. ఇక్కడ సగటున లీటర్ పెట్రోల్ ధర 0.340 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 29.58 గా ఉంది. 

అల్జీరియా

ఈ దేశంలో 5వ స్థానంలో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర 0.339 డాలర్లు (29.49 రూపాయలు)గా ఉంది. 

ఈజిప్ట్

ఈజిప్టులో కూడా పెట్రోల్ ధరలు చాలా తక్కువ. ఈ దేశంలో లీటర్ పెట్రోల్ ధర 0.337 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 29.31గా ఉంది. 

వెనిజులా

అత్యంత తక్కువ పెట్రోల్ ధరలు ఉన్న దేశాల్లో వెనిజులా ఒకటి. ఈ దేశంలో లీటర్ పెట్రోల్ ధర 0.035 డాలర్లు (3.04 రూపాయలు)గా ఉంది. 

లిబియా

ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకు పెట్రోల్ లభిస్తున్న దేశాల్లో లిబియా రెండో స్థానంలో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర 0.031 డాలర్లు (2.61 రూపాయలు)గా ఉంది. 

ఇరాన్

అత్యంత తక్కువ ధరకు పెట్రోల్ లభిస్తున్న దేశాల్లో ఇరాన్ మొదటి స్థానంలో ఉంది. లీటర్ పెట్రోల్ ధర కేవలం 0.029 డాలర్లు (రూ. 1.74) మాత్రమే. 

సోర్స్: గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్, ఆక్టేన్-95

ఇండియాలో ఇప్పుడు నంబర్ 1 కంపెనీ ఏంటో తెలుసా?

తెలివితేటల్లో ప్రపంచంలోనే గొప్పోళ్లు వాళ్లు. ఎవరో తెలుసా?

Silver Anklets: ఈ కలర్ ఫుల్ వెండి పట్టీలను ఎప్పుడైనా ట్రై చేశారా?

Gold Chain: లైట్ వెయిట్ గోల్డ్ చైన్.. రోజూ వేసుకోవడానికి ఇవే బెస్ట్!