business

గుడ్ న్యూస్.. ఈ కారు ఓనర్లు టోల్ ఫీజు కట్టక్కర్లేదు.. కానీ ఓ కండీషన్

Image credits: Getty

గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్

ప్రస్తుతమున్న ఫాస్టాగ్ సిస్టమ్ మారుతోంది. ఈ ఫాస్టాగ్ ప్లేస్ లో టోల్ వసూలు చేయడానికి గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) విధానం ఉంది.

Image credits: Getty

దూరం ప్రకారం టోల్

కొత్త నిబందనల ప్రకారం.. నేషనల్ హైవేపై కొంత దూరం ప్రయాణించే వారు ఇకపై టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

Image credits: Getty

రోజుకి 20 కి.మీ. వరకు ఉచిత ప్రయాణం

జిఎన్ఎస్ఎస్ సదుపాయం ఉన్న కార్లకు నేషనల్ హైవేపై రోజుకి 20 కిలోమీటర్ల వరకు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. అంటే వీటికి టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు.

Image credits: Getty

నోటిఫికేషన్ విడుదల

నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై రోజుకి 20 కి.మీ. వరకు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు అన్న నోటిఫికేషన్ ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

Image credits: Getty

ఈ వాహనాలకు వర్తించదు

20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే కార్ల ఓనర్లు ఖచ్చితంగా టోల్ చెల్లించాల్సిందే. అంతేకాకుండా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే నేషనల్ పర్మిట్ వాహనాలకు ఈ నిబంధన అస్సలు వర్తించదు.

Image credits: Getty

వాహనం ఆపాల్సిన అవసరం లేదు

జిఎన్ఎస్ఎస్ ట్యాగ్‌లు వాహన స్థానాన్ని అలాగే వేగాన్ని గుర్తిస్తాయి. కార్లు ప్రయాణించిన దూరం, వేగాన్ని బట్టి టోల్ ఫీజును వసూలు చేస్తారు. కాబట్టి కారు ఆపాల్సిన అవసరం లేదు. 

Image credits: Getty

రెట్టింపు టోల్

జిఎన్ఎస్ఎస్ సదుపాయం లేని కార్లు జిఎన్ఎస్ఎస్ ఎక్స్‌క్లూజివ్ రహదారులపై జర్నీ చేస్తే రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

Image credits: Getty

జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్-ఏది బెటర్ నెట్‌వర్క్?

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆవు ఏదో తెలుసా?

అత్యధిక పన్ను చెల్లించిన టాప్-10 భారతీయ కంపెనీలు ఇవే

ముఖేష్ అంబానీ తన కొడుక్కి ఎంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారో తెలుసా