QR కోడ్ స్కాన్ చేసే ముందు జాగ్రత్త! ఇలా చేస్తే డబ్బులు పోవు
Image credits: iSTOCK
అసలైనదిగా కనిపించే నకిలీ QR కోడ్
కొన్నిసార్లు దుకాణాల్లో అసలు QR కోడ్‌కు బదులుగా నకిలీ QR కోడ్‌లు ఉంచుతారు. దీనివల్ల మీ డబ్బు మోసగాళ్ల అకౌంట్ కి వెళ్లిపోతుంది.
Image credits: iSTOCK
APK లింక్‌లపై జాగ్రత్త
QR కోడ్ స్కాన్ చేయడానికి APK లింక్‌లను పంపే అపరిచితుల నుండి వచ్చే సందేశాలపై జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు మోసగాళ్లకు దొరకకుండా చూసుకోండి.
Image credits: Getty
UPI ద్వారా చెల్లింపులు సురక్షితం
సోషల్ మీడియాలో కనిపించే QR కోడ్‌లను స్కాన్ చేయడం ప్రమాదకరం. UPI ID ద్వారా చెల్లింపులు చేయడం మంచిది.
Image credits: FREEPIK
వివరాలు సరిచూసుకోండి
QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత, స్క్రీన్‌పై కనిపించే వివరాలను జాగ్రత్తగా చూడండి. ఏమైనా తప్పులుంటే వ్యాపారిని అడగండి.
Image credits: Our own
UPI చెల్లింపుల కోసం ప్రత్యేక అకౌంట్
UPI చెల్లింపుల కోసం ప్రత్యేక ఖాతాలో తక్కువ మొత్తంలో డబ్బు ఉంచండి. దీనివల్ల మోసపోయినా పెద్ద నష్టం జరగదు.