business
ప్రతీ ఒక్కరికీ వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది. అయితే లాభాలు వస్తాయో రాదో అన్న ఉద్దేశంతో వ్యాపారంలోకి అడుగు పెట్టాలని ఉన్నా వెనుకడుగు వేస్తుంటారు.
తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించే అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం కావాల్సిందల్లా ఖాళీ బీర్ బాటిల్స్, ఒక మిషిన్ అంతే.
బీర్ బాటిల్స్‌ను రీసైక్లింగ్ చేయడం ద్వారా వాటిని క్రిస్టల్స్‌గా మారుస్తారు. ఈ క్రిస్టల్స్‌ను గాజు పాత్రలు, సీసలు, గ్లాసుల తయారీలో ఉపయోగిస్తుంటారు.
అలాగే ఈ క్రిస్టల్స్‌ను నిర్మాణ రంగంలో కూడా ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఈ బాటిల్ క్రిస్టల్స్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటోంది.
ఈ వ్యాపారం ప్రారంభించడానికి బాటిల్స్‌ను క్రిస్టల్స్‌గా మార్చే క్రషర్ మిషిన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే స్క్రాప్ పాయింట్స్ నుంచి బాటిల్స్‌ను సేకరించాలి.
ఇక లాభాల విషయానికొస్తే టన్ను గ్లాస్ క్రిస్టల్స్ ప్రస్తుతం రూ. 8 వేలు పలుకుతోంది. టన్ను క్రిస్టల్ తయారీకి రూ. 3000 అవుతుంది. ఈ లెక్కన టన్నుకు రూ. 5000 లాభం పొందొచ్చన్నమాట.