pm kisan: ఈ రైతులకు పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అందవు. ఎందుకంటే..
డబ్బు ఎప్పుడు జమ అవుతుంది
పీఎం కిసాన్ నిధి యోజన 19వ విడత డబ్బు ఫిబ్రవరి 24, 2025న రిలీజ్ అవుతుంది. ప్రధాని మోదీ బీహార్ రాష్ట్రం భాగల్‌పూర్ నుండి రైతుల ఖాతాల్లో డబ్బును బదిలీ చేస్తారు.
ఎంత డబ్బు వస్తుంది?
అర్హులైన రైతులకు రూ.2,000 అందుతాయి. ఇప్పటి వరకు 18 విడతల డబ్బు రైతుల ఖాతాల్లో జమైంది. అయితే కొంతమంది రైతుల ఖాతాల్లో ఈసారి డబ్బు రాదు.
చాలా మంది రైతులను తొలగించారు
ఈసారి పీఎం కిసాన్ 19వ విడత డబ్బు 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి వస్తుంది. కానీ చాలా మంది రైతులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు.
ఎవరికి పీఎం కిసాన్ డబ్బు అందదు?
ఇప్పటివరకు తమ భూమిని ధృవీకరించని రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ 19వ విడత నగదు జమకాదు.
ఇలాంటి రైతులకు కూడా..
ఇప్పటివరకు ఇ-కేవైసీ చేయని రైతులకు కూడా ఈసారి పథకం ప్రయోజనం అందదు. సమీపంలోని సీఎస్‌సీ కేంద్రానికి లేదా pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి వెంటనే ఇ-కేవైసీ చేయించుకోండి.
ఆధార్ లింకప్ చేయని రైతులకు..
ఆధార్ అనుసంధానం చేయని రైతులకు కూడా 19వ విడత డబ్బు అందదు. వెంటనే బ్యాంకు శాఖకు వెళ్లి ఆధార్ కార్డు నంబర్‌ను బ్యాంకు ఖాతాతో లింకప్ చేసుకోండి.
డీబీటీ ఆప్షన్ ఆన్ చేయించుకోని వారికి..
ఎవరైతే బ్యాంకు ఖాతాలో డీబీటీ ఆప్షన్ ఆన్ చేయించుకోలేదో వారికి కూడా పీఎం కిసాన్ డబ్బు అందదు. అటువంటి రైతులు బ్యాంకుకు వెళ్లి దాన్ని ఆన్ చేయించుకోండి.