తక్కువ ధరల్లో హోటల్ గదులు అందిస్తూ హోటల్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఓయో.
Image credits: Google
Telugu
విదేశాల్లోనూ
2013లో ఓయోను రితేష్ అగర్వాల్ స్థాపించగా చైనా, అమెరికా, జర్మనీతో పాటు మరెన్నో దేశాల్లో ఈ సేవలు విస్తరించాయి.
Image credits: Google
Telugu
లాభాలు
ఓయో సంస్థ ఇటీవల ఆర్థికంగా మంచి పురోగతి సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, సంస్థ తొలిసారిగా రూ.100 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
Image credits: Google
Telugu
వివాదాలు
పెళ్లికాని జంటలకు గదులను ఇస్తుందన్న కారణంతో ఓయో పలుసార్లు వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవివాహిత జంటలకు గదులు ఇవ్వకూడదనే నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Image credits: Google
Telugu
తాజా మరో వివాదం
ఇదిలా ఉంటే ఓయో తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది. ఈ సంస్థ న్యూస్ పేపర్‌లో ఇచ్చిన ఓ ప్రకటన మతపరంగా వివాదంగా మారింది.
Image credits: Google
Telugu
వివాదం ఏంటంటే
ఓయో విడుదల చేసిన ప్రకటనలో "దేవుడు ప్రతిచోట ఉన్నాడు'. కిందే 'ఓయో కూడా' అనే క్యాప్షన్ రాసుకొచ్చారు.
Image credits: Google
Telugu
అర్థం ఏంటంటే
దేవుడున్న ప్రతీ చోట ఓయో కూడా ఉంటుందనే అర్థం వచ్చేలా ఈ యాడ్‌ను రూపొందించారు. ఇదే రచ్చకు దారి తీసింది.
Image credits: Google
Telugu
బయ్ కాట్ ఓయో
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ బయ్‌కాట్ ఓయో ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.