business
పెట్రోల్ బంకుల్లో లాభాలు చాలా అంశాలపై ఆధారపడి ఉంటాయి. కేవలం పెట్రోల్ అమ్మడం వల్ల లాభాలు రావు.
సాధారణంగా ఇంధన అమ్మకాలపై లాభం చాలా తక్కువగా ఉంటుంది. లాభాలు రావాలంటే ఎక్కువ లీటర్లు అమ్మాలి.
ఒక లీటరు పెట్రోల్ అమ్మితే బంక్ యజమానికి లీటరుకు రూ. 2 నుండి రూ.3 మాత్రమే వస్తుంది.
కేవలం పెట్రోల్ అమ్మి లాభాలు పొందలేరు. అందువల్ల ఇతర మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి యజమానులు ప్రయత్నిస్తారు.
కార్ వాషింగ్, కిరాణా షాప్, రెస్టారెంట్ ఇలాంటివి బంక్ పక్కనే పెట్టుకోవాలి. వీటిపై ఎక్కువ ఆదాయం వస్తుంది.
మార్జిన్ తక్కువగా ఉన్నప్పటికీ రోజుకు ఎన్ని లీటర్లు అమ్ముతున్నామన్నది ముఖ్యం. ఎంత ఎక్కువ అమ్మితే అంత లాభం వస్తుంది.
జంక్షన్లు, కాలేజీలు, హోటల్స్ లాంటి రద్దీ ప్రదేశాలలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తే లాభాలు వస్తాయి.
నిర్వహణ ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల నికర ఆదాయం మెరుగుపడుతుంది.
ఎప్పుడూ రద్దీగా ఉండే పెట్రోల్ బంకు ద్వారా నెలకు రూ.1 లక్ష నుండి రూ.5 లక్షల వరకు నికర లాభం పొందవచ్చు.