business

తండ్రి అమిత్ షా కంటే కొడుకు జై షా ఎంత ధనవంతుడో తెలుసా?

ఐసీసీ ఛైర్మన్ జై షా

జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఛైర్మన్ అయ్యారు. 35 ఏళ్ల జై షా ఇప్పటివరకు అతి పిన్న వయస్కుడైన ఐసీసీ అధ్యక్షుడు. ఆయన గ్రెగ్ బార్క్లే స్థానంలో నియమితులయ్యారు.

కోటీశ్వరుడు జై షా

మీడియా కథనాల ప్రకారం జై షా నికర విలువ రూ.124 కోట్లు. ఆయన తన వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు. 

అమిత్ షా ఆస్తులు రూ.65 కోట్లు

జై షా తండ్రి, కేంద్ర మంత్రి అమిత్ షా ఆస్తుల విషయానికొస్తే, ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన, ఆయన భార్య కలిసి రూ.65.67 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు.

తండ్రి కంటే ఎంత ధనవంతుడంటే

తండ్రి కంటే కొడుకే ఆస్తుల పరంగా ముందున్నారు. అంటే జై షా దగ్గర అమిత్ షా కంటే దాదాపు రెట్టింపు ఆస్తులు ఉన్నాయి. తండ్రి కంటే రూ.65 కోట్లు ఎక్కువ ఆస్తులు జై షా వద్ద ఉన్నాయి.

ఐదో భారతీయుడిగా జై షా

35 ఏళ్ల వయసులో ఐసీసీ ఛైర్మన్ అయిన జై షా, శరద్ పవార్, జగమోహన్ దాల్మియా, శశాంక్ మనోహర్, ఎన్ శ్రీనివాసన్ తర్వాత ఈ పదవిని చేపట్టిన ఐదో భారతీయుడిగా నిలిచారు.

కాలేజీ ప్రేయసితోనే వివాహం

జై షా తన చదువును గుజరాత్‌లోనే పూర్తి చేశారు. ఆయన బి.టెక్ చదివారు. జై షా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు రిషితా పటేల్. ఆమె ఆయన కాలేజీ స్నేహితురాలు.

పెళ్లి చేసుకుంటే రూ.31 లక్షలు ఇస్తారట.. ఎక్కడంటే?

మీకు పీఎం కిసాన్ 18వ విడత నగదు పడాలంటే ఇవి తప్పనిసరి

క్రెడిట్ కార్డులతో ఈ పనులు అస్సలు చేయవద్దు..

మీ లోన్ EMI త్వరలో తగ్గనుంది.. ఎలాగో తెలుసా?