business

ఇక్కడ పెళ్లి చేసుకుంటే ₹31 లక్షలు ఇస్తారు. మరి రెడీ అయిపోండి

పెళ్లిళ్ల కోసం అప్పులు తప్పవు

భారతదేశంలో పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటంతో చాలా మంది అప్పులు చేయాల్సి వస్తుంది.

ఎక్కడ పెళ్లికి డబ్బులిస్తున్నారంటే?

అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అంతే మొత్తంలో డబ్బులు కూడా వస్తాయంటే.. నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఓ దేశంలో ఇలాగే జరుగుతోంది.

జంటలకు రూ.31 లక్షలు ఇస్తున్న దక్షిణ కొరియా

ఆసియా దేశమైన దక్షిణ కొరియాలో పెళ్లి చేసుకునే జంటలకు ప్రభుత్వం రూ.31 లక్షలు ఇస్తోంది. దీనికి కారణం.. పెళ్లిళ్లను ప్రోత్సహించడమే.

పిల్లలు పుడితే భారీగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం

దక్షిణ కొరియాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో కొత్త జంటలు పెళ్లి చేసుకుని, ఎక్కువ మంది పిల్లలను కనాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

బూసన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రకటన

దక్షిణ కొరియాలోని బూసన్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పెళ్లి చేసుకునే జంటలకు 38,000 డాలర్లు (రూ.31 లక్షలు) ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

తగ్గిపోతున్న దక్షిణ కొరియా జనాభా

దక్షిణ కొరియా జనాభా వేగంగా తగ్గిపోతోంది. అక్కడ ప్రతి మహిలా సగటున 0.72 మంది పిల్లలను మాత్రమే కంటున్నారు. అంటే, ఒక మహిళ ఒక బిడ్డను కూడా కనడం లేదని అర్థం.

5 కోట్ల జనాభాతో దక్షిణ కొరియా

దీంతో జనాభా పెరుగుదల, ప్రసూతి రేటును పెంచేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం కొత్త కొత్త పథకాలను అమలు చేస్తోంది. దక్షిణ కొరియా జనాభా దాదాపు 5 కోట్లు.

జపాన్‌లో కూడా ఇదే పరిస్థితి

దక్షిణ కొరియా మాదిరిగానే జపాన్ కూడా తక్కువ జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. గతంలో ఏడాదికి 50 లక్షలుగా ఉన్న జననాల రేటు.. ప్రస్తుతం 7.60 లక్షలకు పడిపోయింది.

మీకు పీఎం కిసాన్ 18వ విడత నగదు పడాలంటే ఇవి తప్పనిసరి

క్రెడిట్ కార్డులతో ఈ పనులు అస్సలు చేయవద్దు..

మీ లోన్ EMI త్వరలో తగ్గనుంది.. ఎలాగో తెలుసా?

404 ఎర్రర్ చికాకు పెడుతోందా.. ఇలా చేస్తే ప్రాబ్లం సాల్వ్