business

రిలయన్స్-అదానీ కాదు.. భారత్‌లోనే నంబర్ 1 కంపెనీ ఇదే!

Image credits: Social Media

భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్

భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ కలిగిన కంపెనీలలో టాప్-5 లో రిలియన్స్, అదాని గ్రూప్ లు లేవు.

Image credits: Social Media

దేశంలోని టాప్ 75 బ్రాండ్ల విలువ 19% పెరిగింది

కంటార్ బ్రాండ్స్, మార్కెటింగ్ డేటా అండ్ అనాలిసిస్ నివేదిక ప్రకారం భారత్ లోని 75 అత్యంత విలువైన బ్రాండ్‌ల సంయుక్త విలువ 19% పెరిగి $450.5 బిలియన్లకు చేరుకుంది.

Image credits: Social Media

మూడేళ్లుగా నంబర్ 1 స్థానంలో టీసీఎస్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వరుసగా మూడో సంవత్సరం కూడా అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. దీని బ్రాండ్ విలువ 49.7 బిలియన్ డాలర్లు.
 

 

Image credits: social media

టీసీఎస్ విజయ రహస్యం ఏమిటి?

కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో పెట్టుబడుల కారణంగా టీసీఎస్ బ్రాండ్ విలువ 16% కంటే ఎక్కువ పెరిగింది.

Image credits: Social media

భారతదేశంలోని ఇతర టాప్ బ్రాండ్లు

టీసీఎస్ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ కూడా అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో ఉన్నాయి.
 

 

Image credits: our own

వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లు

జొమాటో బ్రాండ్ విలువ అత్యంత వేగంగా పెరిగింది. దీని బ్రాండ్ విలువ రెట్టింపు అయ్యి 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

Image credits: X Twitter

ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానంలో ఎవరు?

మారుతి సుజుకి 17వ స్థానంలో ఉండగా, మహీంద్రా & మహీంద్రా బ్రాండ్ విలువ 78% పెరిగి 30వ స్థానానికి చేరుకుంది.

Image credits: Social Media X

బ్రాండ్ ర్యాంకింగ్ ఎలా తయారు చేస్తారు?

ఈ ఏడాది ర్యాంకింగ్ 108 వర్గాలకు చెందిన 1,535 బ్రాండ్లు, 1.41 లక్షల మంది ప్రతిస్పందనల ఆధారంగా రూపొందించారు.

Image credits: Social Media
Find Next One