business

హమ్మయ్య.. బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి.. ఎందుకో తెలుసా?

ప్రపంచ మార్కెట్లో తగ్గిన ధరలు

ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. అయితే గల్ఫ్‌లో ఉద్రిక్తతల వల్ల అక్కడ బంగారం ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి.

ఇండియాలో బంగారం ధరలు

16 నవంబర్ నాడు ఇండియాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,650. 22 క్యారెట్ల బంగారం ధర రూ.69,350. 18 క్యారెట్ల బంగారం ధర రూ.56,740. 

విదేశాల్లో బంగారం ధర

ఒమన్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి 75,763 రూపాయలు కాగా, ఖతార్‌లో 76,293 రూపాయలు ఉంది. 

ఇండియాలో ధరలు ఎందుకు తగ్గుతున్నాయ్?

ప్రపంచంలో బంగారం ధరలు మూడేళ్లలో అత్యంత భారీగా పతనమయ్యాయి. అమెరికాలో ధరలు 4.5% తగ్గాయి. ఇది రెండు నెలల కనిష్ట స్థాయి 2,563.25 డాలర్లకు చేరుకుంది.

డాలర్ బలపడుతోంది

డాలర్ బలపడింది. దీనివల్ల బంగారం మరింత ఖరీదైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్‌పై ఒత్తిడి పెరిగింది.

ఇండియాలో బంగారానికి డిమాండ్

ఇండియాలో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్, పండగల షాపింగ్‌ల దీనికి కారణం. అయినప్పటికీ బంగారం ధరలు సెప్టెంబర్‌ నెలలో నమోదైన గరిష్ట స్థాయి నుంచి దిగి వచ్చాయి.

ప్రపంచ ఆర్థిక సంకేతాలు

అమెరికాలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం వల్ల ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం తక్కువైంది. దీంతో వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. దీనివల్ల బంగారం ధరలు తగ్గాయి.

గల్ఫ్, సింగపూర్‌లో ధరలు ఎందుకు ఎక్కువ?

ఇజ్రాయెల్, గాజాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా బంగారం డిమాండ్ పెరిగింది. దీంతో గల్ఫ్ దేశాల్లో ధరలు పెరిగాయి.

గల్ఫ్‌లో బంగారానికి డిమాండ్

ఖతార్, ఒమన్ వంటి దేశాల్లో బంగారం రిటైల్, ఇన్‌స్టిట్యూషనల్ డిమాండ్ పెరిగింది. కష్ట కాలంలో బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ప్రజలు భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి

అక్టోబర్‌లో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. గత నెలతో పోలిస్తే 7% తగ్గాయి.

స్పేస్ Xతో ఇస్రో దోస్తీ: GSAT-20 ప్రయోగానికి ఫాల్కన్ 9

ఏ కలర్ వాలెట్ ఉపయోగిస్తే డబ్బు ఎక్కువ సంపాదిస్తారో తెలుసా?

రూ. 7 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ టాప్-6 కార్లు

రూ.20,000 లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు ఇవిగో