business

స్పేస్ Xతో ఇస్రో దోస్తీ: GSAT-20 ప్రయోగానికి ఫాల్కన్ 9

ప్రపంచంలోనే మొట్టమొదటి రీ యూజబుల్ రాకెట్

స్పేస్‌ఎక్స్ కు చెందిన  అమెరికన్ రాకెట్ ఫాల్కన్ 9 పాక్షికంగా తిరిగి ఉపయోగించగల రాకెట్. దీన్ని 2018లో మొదట ఉపయోగించారు. 

99 శాతం సక్సెస్ రేటు

ఫాల్కన్ రాకెట్ దాదాపు 393 ప్రయోగాల్లో పాల్గొంది. కేవలం నాలుగు సార్లు మాత్రమే ఫెయిల్ అయ్యింది. ఈ రాకెట్ సక్సెస్ రేట్ 99 శాతం.

ప్రయోగం ఖర్చు 70 మిలియన్ డాలర్లు

ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఒక ప్రత్యేక ప్రయోగం ఖర్చు సగటున 70 మిలియన్ డాలర్లు.

రీ యూజబుల్ లాంచర్

స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 ముఖ్య లక్షణం ఏమిటంటే దీన్ని తిరిగి ఉపయోగించవచ్చు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్బిటల్-క్లాస్ పునర్వినియోగ రాకెట్.

సేఫ్ ల్యాండింగ్ ఫాల్కన్ ప్రత్యేకత

ఫాల్కన్ 9 రాకెట్ 349 స్టేజస్ ల్యాండింగ్‌లను చేసింది. రాకెట్ ఫస్ట్ స్టేజ్ పనిని పూర్తి చేసిన తర్వాత తిరిగి దాని ప్లేస్ కి తిరిగి వస్తుంది.

ప్రపంచ రికార్డు సృష్టించింది

2021లో ఫాల్కన్ 9 ఒకే మిషన్‌లో 143 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. 2017లో ఇండియాకు చెందిన PSLV ఒకే మిషన్‌లో 104 ఉపగ్రహాలను ప్రయోగించింది.  

మరో రికార్డ్ వైపు

2024లో ఫాల్కన్ 9 ఇప్పటికే 106 ప్రయోగాలు చేసింది. ఈ ఏడాది మొత్తం 148 ప్రయోగాలను పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యం. ఇదే జరిగితే రికార్డుల్లో నిలుస్తుంది.

ఏ కలర్ వాలెట్ ఉపయోగిస్తే డబ్బు ఎక్కువ సంపాదిస్తారో తెలుసా?

రూ. 7 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ టాప్-6 కార్లు

రూ.20,000 లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు ఇవిగో

ఆ చెట్టును ఎవరు టచ్ చేసినా భారత్ - పాక్ రెండూ ఊరుకోవు