business

మీ దగ్గర రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా? అర్జెంటుగా ఇక్కడ మార్చేసుకోండి

బ్యాంకులోనే డిపాజిట్ చేయవచ్చు

మీ దగ్గర ఇంకా రూ.2000 నోట్లు ఉంటే వాటిని మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి జరిమానా లేదు.

మార్కెట్లో రూ.7,261 కోట్ల విలువైన రూ.2000 నోట్లు

ఆగస్టు 2024 నాటికి రూ.7,261 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా మార్కెట్లో ఉన్నాయని RBI తెలిపింది.

RBI కార్యాలయాల ఏర్పాటు

రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి RBI 19 ప్రాంతాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్ మొదలైన చోట్ల కార్యాలయాలు ఉన్నాయి.

ఇక్కడ కూడా రూ.2000 నోట్లు తీసుకుంటారు

జైపూర్, జమ్మూ, కోల్‌కతా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, తిరువనంతపురం RBI కార్యాలయాల్లో కూడా రూ.2000 నోట్లు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పటికే 97.96% నోట్లు తిరిగి వచ్చాయి.

2016లో వచ్చిన రూ.2000 నోట్లు

2016 నోట్ల రద్దు తర్వాత భారత ప్రభుత్వం రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. ఒకేసారి రూ.20,000 విలువైన రూ.2000 నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు.

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి!

నెలకు రూపాయి కడితే చాలు: రెండు లక్షల బీమా మీకు ఎంతో రక్షణ

తండ్రి అమిత్ షా కంటే కొడుకు జై షా ఎంత ధనవంతుడో తెలుసా?

పెళ్లి చేసుకుంటే రూ.31 లక్షలు ఇస్తారట.. ఎక్కడంటే?