EPFO త్వరలోనే కొత్త వెర్షన్ 3.0ను ప్రారంభించనుంది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
కొత్త వ్యవస్థ ద్వారా క్లెయిమ్ సెటిల్మెంట్ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ప్రాసెస్ సమయం తగ్గుతుంది.
ఈ కొత్త విధానంలో EPFO డబ్బులు మరింత సులువుగా తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాసెస్ లేకుండా నేరుగా ఏటీఎంలో కూడా డబ్బులు తీసుకోవచ్చు.
పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి ఇప్పుడున్నట్లు ఫామ్స్ నింపాల్సిన పనిలేదు. కేవలం ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
అంతే కాకుండా ఈ కొత్త ఫీచర్లతో పెన్షన్ స్థితిని రియల్ టైంలో ట్రాక్ చేయవచ్చు. ఏ బ్యాంకులోనైనా పెన్షన్ పొందవచ్చు.
ప్రస్తుతం EPFO వద్ద 27 లక్షల కోట్ల నిధి ఉంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు 8.25% వడ్డీ అందిస్తోంది.
EPFOను అటల్ పెన్షన్, జీవన్ బీమా, జన్ ధన్ పథకాలతో అనుసంధానించేందుకు కూడా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. 3.0లో లాంటి లాభాలు ఉండనున్నాయి.
మే లేదా జూన్ 2025 నాటికి EPFO 3.0 ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా 9 కోట్ల మందికి పైగా లబ్ధి పొందనున్నారు.
UPIతో కూడా డబ్బులు సంపాదించొచ్చు! స్మార్ట్ ట్రిక్స్ ఇవే
Gold bangles: డైలీవేర్ కి ఈ బంగారు గాజులు బెస్ట్ ఆప్షన్..!
Gold Earrings: ఈ ఇయర్ రింగ్స్ ఎవ్వరికైనా సూపర్ గా సెట్ అవుతాయి!
10 నిమిషాల్లో ఇంటి వద్దకే సిమ్‌కార్డు.. కొత్త సేవలు