business
Google Pay, PhonePe, Paytm, Amazon Pay వంటి UPI యాప్‌లు రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను అందిస్తాయి. స్నేహితులను రిఫర్ చేయడంతో రూ.100 కంటే ఎక్కువగా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
బిల్లు చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్, లోన్ EMIలపై కూడా క్యాష్‌బ్యాక్-రివార్డ్‌లు లేదా స్క్రాచ్ కార్డ్‌లు లభిస్తాయి. దీంతో మీకు యూపీఐలో డబ్బులు వస్తాయి.
చాలా యాప్‌లు టాస్క్ లను పూర్తి చేస్తే డబ్బులిస్తాయి. Roz Dhan వంటి యాప్‌లో ఆర్టికల్స్ చదవడం, వీడియోలు చూడటం, Meeshoలో ప్రోడక్టులు అమ్మి లాభం నేరుగా UPIలో పొందవచ్చు.
మీరు కంటెంట్ రైటింగ్, డిజైనింగ్, కోడింగ్ లేదా ఏదైనా నైపుణ్యంలో మంచివారైతే, Fiverr, Upwork, Freelancer వంటి సైట్‌లలో ఉద్యోగం చేసి UPI చెల్లింపును సులభంగా పొందవచ్చు.
Meesho, Groww, CRED, Upstox, Zerodha, Paytm Money వంటి ప్లాట్‌ఫారమ్‌లు రిఫెరల్‌కు బదులుగా ₹50 నుండి ₹500 వరకు ప్రయోజనం అందిస్తాయి.
మీరు ఇంట్లో తయారుచేసిన ఆహారం లేదా ఏదైనా ఉత్పత్తిని అమ్మితే, మీరు మీ స్వంత WhatsApp షాపు లేదా Instagram స్టోర్‌ను సృష్టించుకోవచ్చు. నేరుగా UPI QR కోడ్ ద్వారా డబ్బు తీసుకోవచ్చు.
ధృవీకరించబడిన యాప్‌లు, ఆఫర్‌లను మాత్రమే ఉపయోగించండి. ఎవరికీ OTP లేదా PIN చెప్పొద్దు. RBI లేదా NPCI ఆమోదించిన UPI యాప్‌లను మాత్రమే ఉపయోగించండి.