10 నిమిషాల్లో ఇంటి వద్దకే సిమ్‌కార్డు.. కొత్త సేవలు
Image credits: packageslife
వేగంగా విస్తరిస్తున్న క్విక్‌కామర్స్
ఆర్డర్ చేసిన నిమిషాల్లో డెలివరీ చేసే క్విక్‌కామర్స్ రంగం ప్రస్తుతం విస్తరిస్తోంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను సైతం పది నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు.
Image credits: Our own
బ్లింకిట్ వినూత్న నిర్ణయం
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్త బ్లింకిట్ కొత్త సేవను ప్రారంభించింది. ఇందులో భాగంగా సిమ్‌లను ఇంటి వద్దకు అందించనున్నారు.
Image credits: Google
ఎయిర్‌టెల్‌తో ఒప్పందం
బ్లింకిట్‌తో కలిసి ఎయిర్ టెల్ తన కస్టమర్లకు కేవలం 10 నిమిషాల్లోనే ఇంటి వద్దకు సిమ్ కార్డుల డెలివరీని అందించనున్నట్లు ప్రకటించింది.
Image credits: Twitter
తొలుత 16 నగరాల్లో
ఈ సేవలను తొలుత దేశంలో పలు ప్రధాన 16 నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.
Image credits: Twitter
రూ. 49కి సిమ్ కార్డు
కేవలం రూ.49 చెల్లించి సిమ్ కార్డును ఆర్డర్ చేయవచ్చు. సదరు నెంబరును ఆధార్ కేవైసీ ద్వారా యాక్టివేట్ చేయనున్నట్లు ప్రకటించింది.
Image credits: our own
సిమ్ యాక్టివేషన్ ఎలాగంటే
బ్లింకిట్ కేవలం సిమ్ డెలివరీ సేవలను అందిస్తుందని, వినియోగదారులు సెల్ఫ్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయటం ద్వారా సొంతంగా సిమ్ కార్డును యాక్టివేట్ చేసుకోవాలి.