business

వామ్మో.. ఎలాన్ మస్క్ దగ్గర అంత డబ్బుందా?

$400 బిలియన్ల సంపద

SpaceX, టెస్లా CEO ఎలాన్ మస్క్ $400 బిలియన్లకు పైగా సంపదను ఆర్జించిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. 

మస్క్ సంపద ఇలా పెరిగింది

Bloomberg నివేదిక ప్రకారం అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన సంపద పెరిగింది. SpaceXలో ఇటీవల షేర్ల అమ్మడం కూడా కలిసి వచ్చింది. 

SpaceX షేర్ల అమ్మకం

SpaceX షేర్ల అమ్మకం ద్వారా మస్క్ సంపద దాదాపు $50 బిలియన్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం సంపద $439.2 బిలియన్లు అయ్యింది. 

భారీ లాభాలు

2022 చివరిలో మస్క్ సంపద $200 బిలియన్లకు పైగా తగ్గింది. అయితే ట్రంప్ ఎన్నిక ఆయనకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

టెస్లా షేర్లు 65% పెరుగుదల

ట్రంప్ విధానాలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ, మార్కెట్ కి ఉపయోగపడతాయని వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. అందువల్లే ప్రస్తుతం టెస్లా షేర్లు 65% పెరిగాయి.

ప్రభుత్వంలో కీలక పాత్ర

ట్రంప్ పరిపాలనలో కొత్త 'ప్రభుత్వ పనితీరు విభాగం' సహ అధ్యక్షుడిగా ఎలాన్ మస్క్ ఎలక్ట్ అయ్యారు. ఈ స్టెప్ తో ఆయన రాజకీయంగా, వ్యాపారపరంగా ఎదగడానికి అడుగుపడింది. 

పెరుగుతున్న విలువ

మస్క్ కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI విలువ ఏడు నెలల్లోనే $50 బిలియన్లకు రెట్టింపు అయింది. అందుకే ఆయన సంపద విలువ పెరుగుతోంది. 

ట్రంప్ మద్దతు

SpaceX ఆదాయం అమెరికా ప్రభుత్వ ఒప్పందాలపై ఆధారపడి ఉంది. అందుకే ట్రంప్ నాయకత్వం SpaceXకి ప్రయోజనం చేకూరుస్తోంది. 

మస్క్ కలకు మద్దతు

వ్యోమగాములను అంగారకుడిపైకి పంపాలన్న తన కలను ఎన్నికల ప్రచారంలో మస్క్ వెల్లడించారు. దీనికి ట్రంప్ మద్దతు ఇచ్చారు. ఎన్నికల తర్వాత SpaceX ప్రయోగంలో మస్క్‌తో కలిసి ట్రంప్  కనిపించారు.

క్రెడిట్ కార్డు విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి!

గ్రహాలన్నిటిలోనూ స్పీడ్ గా తిరిగే గ్రహం ఏంటో తెలుసా?

ఆన్‌లైన్ జాబ్ స్కామ్‌ల నుండి ఇలా తప్పించుకోండి

BSNLలో 4G VoLTEని యాక్టివేట్ చేయాలా? ఇదిగో సింపుల్ టిప్