business
క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడండి. బడ్జెట్ దాటి ఖర్చు చేయకండి. ప్లానింగ్ లేని ఖర్చులు అప్పులకు దారితీస్తాయి.
క్రెడిట్ కార్డ్ బిల్లులు ఎప్పుడూ సమయానికి చెల్లించండి. లేకపోతే భారీ వడ్డీలు కట్టక తప్పదు. జీతం మొత్తం వడ్డీలకే సరిపోతుంది.
క్రెడిట్ కార్డ్ కంపెనీలు మినిమం చెల్లింపు ఆప్షన్ ఇస్తాయి. అస్సలు దాని జోలికి వెళ్లకండి. దీని వల్ల వడ్డీ ఎక్కువ అవుతుంది. మొత్తం బ్యాలెన్స్ ఒకేసారి చెల్లించడానికి ప్రయత్నించండి.
క్రెడిట్ కార్డ్ ఖర్చులను మీ క్రెడిట్ లిమిట్ లోపలే ఉంచుకోండి. అది దాటితే వడ్డీలు పెరుగుతాయని గుర్తుంచుకోండి.
చాలా క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఫ్రీ ట్రాన్షాక్షన్స్, ప్రత్యేక ఆఫర్లు అందిస్తాయి. వీటిని ఉపయోగించుకుంటే మీకు డబ్బులు కలిసి వస్తాయి.
క్రెడిట్ కార్డ్ అప్పు ఎక్కువైతే కొన్ని బ్యాంకులు లోన్ డిస్కౌంట్లను ఇస్తాయి. మీరు వాటికి అర్హులైతే తప్పకుండా ఉపయోగించుకోండి.
క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. కార్డ్ వాడకంలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోండి.
క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు, బ్యాంకు రూల్స్, వడ్డీ రేట్లు తెలుసుకోండి. మీ అవసరాలకు తగిన కార్డును మాత్రమే ఎంచుకోండి.
క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లతో ఆకర్షిస్తాయి. వాటి వెనుక కఠిన రూల్స్ మీరు కచ్చితంగా తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి.
అవసరమైనప్పుడే క్రెడిట్ కార్డును వాడండి. అనవసరమైన కొనుగోళ్లకు లేదా షోఆఫ్ కోసం ఉపయోగించి ఇబ్బందులు పడకండి.