business
ఇప్పుడు ఆన్‌లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. క్రెడిట్ స్కోర్ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఇది గుర్తించడం కష్టమైన విషయమే.
మీ వ్యక్తిగత వివరాలు దొంగిలించి మోసగాళ్లు మీ పేరు మీద కొత్త క్రెడిట్ కార్డు క్రియేట్ చేసి లోన్ తీసుకుంటారు. దీన్నే క్రెడిట్ స్కోర్ ఫ్రాడ్ అంటారు.
ఈ ఫ్రాడ్ వల్ల మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. భవిష్యత్తులో బ్యాంక్ మీకు లోన్ ఇవ్వడానికి లేదా ఫైనాన్షియల్ హెల్ప్ చేయడానికి నిరాకరిస్తుంది.
చాలా కేసుల్లో ఈ మోసం సంవత్సరాల వరకు తెలియదు. బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం లేదా బకాయిలు కట్టమని నోటీసులు వస్తే ఈ మోసం బయటపడుతుంది.
కారణం లేకుండా క్రెడిట్ స్కోర్ పడిపోవడం, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో తేడాగా ట్రాన్సాక్షన్స్ కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
కొన్నిసార్లు క్రెడిట్ రిపోర్ట్‌లో మీకు తెలియని ఎంక్వైరీలు కనిపిస్తాయి. మీరు ఎప్పుడూ తెరవని అకౌంట్స్, తెలియని ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి.
జాగ్రత్తగా ఉంటే ఈ ఫ్రాడ్ నుండి తప్పించుకోవచ్చు. బ్యాంక్ స్టేట్‌మెంట్ చూసి ఊరుకోకుండా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి.
మీ కార్డుపై చిన్న ట్రాన్సాక్షన్ అలర్ట్స్ సెట్ చేసుకోండి. అప్పుడు చిన్న అమౌంట్ పోయినా వెంటనే తెలుస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్, పేమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి.
క్రెడిట్ స్కోర్ సేఫ్‌గా ఉండాలంటే మీ సిబిల్ రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. తెలియని యాక్టివిటీని అస్సలు లైట్ తీసుకోవద్దు.
వెంటనే మీ బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్‌కు చెప్పండి. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి. సిబిల్ రిపోర్ట్ అప్‌డేట్ చేయించండి.