business
కారు కొనే ముందు దాని అవసరం ఎంత వరకు ఉందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కేవలం లగ్జరీ కోసం అంత పెట్టుబడి పెట్టడమనేది సరైంది కాదు.
ఇల్లు, పిల్లల చదువులు వంటి అవసరాలు తీరిన తర్వాత కారు గురించి ఆలోచిస్తే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
మీరు కొనుగోలు చేసిన కారుపై ఆదాయం వెంటనే వస్తుందనుకుంటే ఎలాంటి అనుమానం లేకుండా కొనుగోలు చేయవచ్చు.
మీ ఆదాయం ఎంత ఉంది.? మీ ఖర్చులు ఎంత ఉన్నాయి.? అన్న విషయాలను బేరీజు వేసుకొని అవసరానికి మించి ఆదాయం ఉంటే కొనుగోలు చేసుకోవచ్చు.
మీరు కారుపై చేసే పెట్టుబడి తర్వాతి రోజే నుంచే కారు విలువ పడిపోతుంది. అందుకే కారు అనేది పెట్టుబడి కాదు కేవలం ఖర్చుగాన భావించాలి.
మంచి కండిషన్ ఉన్న సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడం మధ్య తరగతి వారికి సూచించతగ్గ అంశంగా చెప్పొచ్చు.
చివరిగా కారు కొనుగోలు చేయాలా వద్దా అనేది మన అవసరం, ఆర్థిక పరిస్థితి ఆధారంగానే నిర్ణయించుకోవాలి.
Vastu Tips for Money: ఇంట్లో నెమలి పింఛం పెడితే డబ్బు సమస్య ఉండదా?
Bank Loan: బ్యాంకు లోన్ తీసుకోవడం పాపమా? స్వామీజీ ఏమన్నారంటే..
Money Flow at Home: ఇంట్లో ఈ 5 వస్తువులు తొలగిస్తేనే డబ్బు నిలుస్తుంది
Makhana Farming: మఖానా సాగుతో రూ.లక్షల్లో లాభాలు!