business
ప్రస్తుతం యువత ఆలోచన మారుతోంది. ఉన్న ఊరిలోనే మంచి వ్యాపారాలు ప్రారంభించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఉద్యోగం కంటే వ్యాపారానికే జై కొడుతున్నారు.
ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అలాంటి బెస్ట్‌బిజినెస్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి.
ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్ ఏర్పాటుతో మంచి లాభాలు ఆర్జించవచ్చు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు.
ఈ వ్యాపారానికి ఒక స్టాల్, ఫ్రెంచ ఫ్రై తయారీ మిషన్, పొటాటో ఫింగ్ చిప్స్, చాట్ మసాలా, నూనె వంటి ముడు సరుకులు కావాలి. మొత్తం మీద రూ. 20 నుంచి రూ. 30 వేలలో ప్రారంభించవచ్చు.
మార్కెట్లో పొటాటో ఫింగర్ చిప్స్ ధర 2.5 కిలోల ప్యాకెట్ ధర రూ. 270 నుంచి రూ. 300 వరకు లభిస్తాయి. రడీమెడీగా లభించే వీటిని నూనెలో వేయించి, ప్యాకింగ్ చేసి విక్రయిస్తే సరిపోతుంది.
కప్పు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి రూ. 20 ఖర్చు అవుతుంది. ఒక్క ప్యాకెట్‌ను రూ. 50కి విక్రయించినా రూ. 30 లాభం ఉంటుంది. రోజుకు ఒక 50 ప్యాకెట్స్ విక్రయించినా రూ. 1500 లాభం ఏటూ పోదు.