business
రీసైక్లింగ్ అనే అనగానే మన మనసులోకి ప్లాస్టిక్, గాజు బాటిల్స్ వస్తాయి. కానీ పాత దుస్తులను కూడా రీసైక్లింగ్ చేస్తారని తెలుసా? ఇప్పుడు ఈ వ్యాపారం బాగా ట్రెండింగ్‌లో ఉంటోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతోన్న మొత్తం టెక్స్‌టైల్ వేస్ట్‌లో 8.5 శాతం భారత్ నుంచే వస్తోంది. ఏటా సుమారు 7800 కిలో టన్నుల టెక్స్‌టైల్ ఉత్పత్తి అవుతోంది.
పాత దుస్తులతో టైల్స్ తయారీ చేస్తారు. ముందుగా పెద్ద ఎత్తున పాత దుస్తులను సేకరిస్తారు. వీటిని చిన్న చిన్న తుక్కువగా మార్చేస్తారు. దీనికి అవసరమయ్యే మిషన్ ధర రూ. 2 లక్షలు ఉంటుంది.
తుక్కుగా మార్చిన దుస్తులను బ్లెండర్ మిషిన్‌లో వేయాలి. అనంతరం అందులో క్లషడ్ గ్లాస్, పొటాష్ పౌడర్‌ను వేసి మిక్స్ చేస్తారు.
ఇక చివరిగా ఈ రా మెటీరియల్‌ను టైల్స్ తయారీ మిషిన్‌లో వేయాలి. ఈ మిషిన్ ధర రూ. లక్ష వరకు ఉంటుంది.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సుమారు రూ. 8 లక్షలు అవుతుంది. ఇక లాభాల విషయానికొస్తే ఒక్కో టైల్‌పై సుమారు రూ. 30 లాభం పొందొచ్చు.