business

ఆటోలో మీటర్ మోసాలను ఇలా గుర్తించండి

Image credits: Getty

ముంబైలో జరిగిన ఘటన

మీటర్‌లో మార్పులు చేసి ఆటో డ్రైవర్ పర్యాటకులను మోసం చేసిన ఘటన ముంబైలో వైరల్ అయ్యింది.

Image credits: Getty

రాకెట్ లా పరుగెత్తే మీటర్లు

మీటర్లలో మార్పులు చేయడం వల్ల అవి తప్పుగా పనిచేస్తున్నాయన, ఎక్కువ రీడింగ్ చూపిస్తున్నాయని ముంబై పోలీసులు తెలిపారు. 

Image credits: Getty

నకిలీ మీటర్లు

తప్పుడు రీడింగులు చూపించే నకిలీ మీటర్లు అమరుస్తున్నట్లు వార్తలు, వీడియోలు వెలుగుచూస్తున్నాయి. 

Image credits: Getty

సాఫ్ట్‌వేర్ మార్పులు

కొందరు ఆటో డ్రైవర్లు డిజిటల్ మీటర్లలో సాఫ్ట్‌వేర్ మార్పులు చేయిస్తున్నారు. దీని వల్ల అవి ఎక్కువ ఛార్జీలను చూపిస్తున్నాయి. 

Image credits: Getty

తప్పించుకోవడం ఎలా

ఆటో మీటర్‌లో మార్పు ఉందో లేదో తెలుసుకోవడానికి మీటర్‌లో కుడివైపున చిన్న రెడ్ కలర్ లో ఉన్న చుక్కను చూడండి.

Image credits: Getty

ఎర్ర చుక్క మెరుస్తుంది

మీటర్‌లో మార్పు ఉంటే ఈ చిన్న ఎర్ర చుక్క మెరుస్తుంది. మార్పు లేకపోతే ఈ చుక్క అసలు కనిపించదు. 

Image credits: Getty

దీన్ని కూడా గమనించండి

హ్యాండిల్ బటన్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ మెరుపు లైట్ వెలుగుతూ ఉంటే అది నకిలీ మీటర్ అని అర్థం. 

Image credits: Getty

ఇంకా మోసాలు ఉన్నాయి

కొందరు ఆటో రిక్షాలలో అనేక రకాల మీటర్ సంబంధిత మోసాలకు పాల్పడుతున్నారు. 

Image credits: Getty

మీటర్ వాడటానికి విముఖత

కొందరు డ్రైవర్లు మీటర్ వాడటానికి ఇష్టపడక అధిక ఛార్జీలు చెప్పవచ్చు. ముఖ్యంగా చిన్న దూరాలకు, రాత్రి ప్రయాణాలకు ఎక్కువ వసూలు చేస్తారు.

Image credits: Getty

నకిలీ ఛార్జీ చార్టులు

కొంతమంది డ్రైవర్లు నకిలీ లేదా పాత ఛార్జీ చార్టులు చూపించి ఇవే అమలులో ఉన్నాయని చెబుతుంటారు.

Image credits: Getty

తప్పుడు కాలిబ్రేషన్

సరిగ్గా కాలిబ్రేట్ చేయని మీటర్లు కూడా తప్పుడు ఛార్జీలను చూపిస్తాయి.

Image credits: Getty

వెయింటిగ్ ఛార్జీలు

డ్రైవర్లు వేచి ఉండే సమయానికి తప్పుడు ఛార్జీలు వేయవచ్చు. లేదా ఆ సమయాన్ని అనవసరంగా పెంచవచ్చు.

Image credits: Getty

వేరే దారి ఉందని..

ఛార్జీలు పెంచడానికి కొందరు డ్రైవర్లు ఎక్కువ సమయం పట్టే లేదా అనవసరమైన మార్గాల్లో తీసుకెళతారు. 

Image credits: Getty

మీ ఇంటి ఇల్లాలికి నచ్చే ఎలక్ట్రిక్‌ స్కూటర్ ఇదిగో

రూ.39,999లకే ఓలా కొత్త ఈవీ బైక్‌

FDలపై అధిక వడ్డీ రేట్లు ఇచ్చే టాప్ 6 బ్యాంకులు ఇవే

ఆన్‌లైన్ లోనే కొత్త పాన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు