business
ఎలక్ట్రిక్ వాహన తయారీలో ముందున్న ఓలా సంస్థ అందుబాటు ధరలో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది.
ఓలా GIG ఒక్కసారి ఛార్జ్ చేస్తే 112 కి.మీ. వెళ్తుంది. మాక్సిమం స్పీడ్ గంటకు 25 కి.మీ. దీని ధర రూ.39,999 నుంచి ప్రారంభం.
ఓలా GIG + ఒక్కసారి ఛార్జ్‌తో 81 కి.మీ. వెళ్తుంది. దీని మాక్సిమం స్పీడ్ గంటకు 45 కి.మీ. మార్కెట్ లో దీని ధర రూ.49,999.
ఓలా S1 Z ధర రూ.59,999 నుంచి ప్రారంభమవుతుంది. ఫీచర్స్ పెరిగితే ధర కూడా పెరుగుతుంది. ఇది 4.8 సెకన్లలో 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కి.మీ. వెళ్తుంది. గంటకు 70 కి.మీ. వేగంతో ఇది దూసుకుపోతుంది.
ఓలా S1 Z+ లో బ్యాటరీ మార్చుకునే వీలు ఉంటుంది. ఇది కూడా గంటకు 70 కి.మీ. స్పీడ్ తో వెళుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌తో 75 కి.మీ. వెళ్తుంది.
ఈ స్కూటర్ 1.8 సెకన్లలో 20 కి.మీ. వేగాన్ని, 4.7 సెకన్లలో 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
కొత్త స్కూటర్ల విడుదలతో ఓలా షేర్లు 15% పెరిగాయి.