business

ఆ 7 దేశాల్లో సోషల్ మీడియా ఉపయోగిస్తే జైలుకే

ఆస్ట్రేలియాలో నిషేధం

తమ దేశంలో సోషల్ మీడియా వినియోగం కోసం ఆస్ట్రేలియా ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. ఇప్పుడు 16 ఏళ్లలోపు పిల్లలు దీన్ని ఉపయోగించలేరు.

చైనాలో చాలా కఠిన చట్టాలు

సోషల్ మీడియాపై చైనా చాలా కఠినమైన కంట్రోలింగ్ ను కలిగి ఉంది. Facebook, X, YouTube లను ఇక్కడ బ్లాక్ చేశారు. 

ఉత్తర కొరియాలో కూడా..

ఉత్తర కొరియాలో ఇంటర్నెట్, సోషల్ మీడియా యాక్సెస్ పై నిషేధం ఉంది. కొన్ని ఉన్నత వర్గాలు ప్రభుత్వ అనుమతితో మాత్రమే వాటిని యాక్సెస్ చేయగలవు. 

సౌదీ అరేబియాలో అరెస్టు తప్పదు

సౌదీ అరేబియాలో సోషల్ మీడియాను నిశితంగా పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం, రాజ కుటుంబం, మతపరమైన పోస్ట్‌లకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యాఖ్యలు, పోస్ట్‌లు పెడితే అరెస్టు, జైలు శిక్ష తప్పదు. 

యుద్ధం వల్ల రష్యాలో కూడా..

రష్యా కూడా ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై అనేక ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభమైన తర్వాత 2022 నుండి కండీషన్స్ అమల్లో ఉన్నాయి.

యుఏఈలో అకౌంట్స్ చెకింగ్

యుఏఈలో కూడా సోషల్ మీడియాను నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, పుకార్లు వ్యాప్తి చేయడం, ఇస్లాంకు వ్యతిరేకంగా పోస్ట్ చేయడం, షేర్ చేయడం ఇక్కడ నేరం.

ఇరాన్‌లో నిషేధం

ఇరాన్‌లో Facebook, Twitter, Instagram, YouTube చూడటం నిషేధం. అలా చేస్తే కఠిన శిక్షలు తప్పవు. 

ఇండియన్ నేవీలో చేరాలనుందా? ఇలా చేయండి

ఆటోలో మీటర్ మోసాలను ఇలా గుర్తించండి

మీ ఇంటి ఇల్లాలికి నచ్చే ఎలక్ట్రిక్‌ స్కూటర్ ఇదిగో

రూ.39,999లకే ఓలా కొత్త ఈవీ బైక్‌