business
మీ బైక్‌ను రాత్రి పూట ఆరుబయట పార్క్ చేయకండి. ఏదైనా క్లోజ్ చేసిన షెడ్ లో ఉంచండి.
స్పార్క్ ప్లగ్‌ను రెగ్యులర్ గా శుభ్రం చేయండి. అది పాతదైనా, దెబ్బతిన్నా చలికాలం కాబట్టి మార్చండి. బైక్ కి స్టార్టింగ్ ప్రాబ్రమ్ రాదు.
చలికాలంలో సెల్ఫ్ స్టార్ట్ కంటే కిక్ స్టార్ట్ చేయడం వల్ల మీ బైక్ బాగా పనిచేస్తుంది. బైక్‌ను స్టార్ట్ చేసి నెమ్మదిగా యాక్సలరేషన్ పెంచండి.
చలికాలంలో మీ బైక్ పర్ఫెక్ట్ గా పనిచేయాలంటే నాణ్యమైన ఇంజిన్ ఆయిల్‌నే ఉపయోగించండి. అవసరమైతే వెంటనే ఇంజిన్ ఆయిల్ మార్చండి.
చలికాలంలో జనరల్ గానే రోడ్డుపై టైర్లు జారతాయి. ఒకసారి మీ బైక్ టైర్లు ఎలా ఉన్నాయో చెక్ చేయండి. అవసరమైతే మార్చేయండి.
చలికాలంలో ఇంజిన్ చల్లగా అయిపోతుంది. అందుకే మీ రైడ్‌ను ప్రారంభించే ముందు ఇంజిన్ స్టార్ట్ చేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి.
మీ బైక్ బ్యాటరీని ఒకసారి చెక్ చేయండి. బ్యాటరీ టెర్మినల్స్ శుభ్రంగా, పూర్తిగా ఛార్జ్ అయి ఉన్నాయో లేదో చెక్ చేయండి.
చలికాలంలో బ్రేక్ లు పట్టేస్తాయి. అందువల్ల ఒకసారి బ్రేక్ లపై ఆయిల్ వేయండి. చైన్ కూడా చెక్ చేయండి. బ్రేక్ సిస్టమ్ మొత్తం తనిఖీ చేసి సెట్ చేయించండి.
చలికాలం కాబట్టి బైక్స్ తో పాటు రోడ్డు కూడా తడిగా ఉంటుంది. అందువల్ల వేగంగా వెళ్లడం మంచిది కాదు. స్లోగా, సడన్ బ్రేక్స్ వేయకండా రైడ్ చేయండి.